చీకటి జీవోలు రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-01-27T06:24:28+05:30 IST

నూతన పీఆర్‌సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పీఆర్‌సీ సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం ఉపాధ్యాయులు, ఉద్యోగులు నిరసన ర్యాలీ నిర్వహించారు. చీకటి జీవోలను రద్దు చేయాలని, మెరుగైన పీఆర్‌సీ ప్రకటించాలని, హెచ్‌ఆర్‌ఏ పాత శ్లాబులు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

చీకటి జీవోలు రద్దు చేయాలి
చింతపల్లిలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తున్న పీఆర్‌సీ సాధన సమితి ప్రతినిధులు

మెరుగైన పీఆర్‌సీ ప్రకటించాలి

సీపీఎస్‌ని రద్దుచేయాలని

పీఆర్‌సీ సాధన సమితి డిమాండ్‌

నిరసన ర్యాలీలు, అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు


పాడేరు, జనవరి 26: నూతన పీఆర్‌సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పీఆర్‌సీ సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం ఉపాధ్యాయులు, ఉద్యోగులు నిరసన ర్యాలీ నిర్వహించారు. చీకటి జీవోలను రద్దు చేయాలని, మెరుగైన పీఆర్‌సీ ప్రకటించాలని, హెచ్‌ఆర్‌ఏ పాత శ్లాబులు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలు బి.వెంకటపతిరాజు, ఎస్‌వీ.రమణ, ఎల్‌.అప్పారావు, ఎస్‌.సంజీవరాజు, ఎ.శ్యామ్‌సుందర్‌, ఆర్‌.జగన్మోహనరావు, కె.దేముళ్లనాయుడు, ఎల్‌.వెంకటరమణదొర, ఎం.జాన్‌, ఎం.ప్రసాదరావు, సీహెచ్‌.మేనక, టి.కొండబాబు, జె.కూర్మారావు, ఎస్‌.శంకర్‌ప్రసాద్‌, ఆర్‌.నాగభూషణరాజు, ఎస్‌.నాగరాజు, కాంతారావు, గంగరాజు, తదితరులు పాల్గొన్నారు.  


చింతపల్లిలో

చింతపల్లి: పీఆర్‌సీ సాధన సమితి ఆధ్వర్యంలో చింతపల్లి, జీకేవీధి మండలాలకు చెందిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు హనుమాన్‌ జంక్షన్‌ నుంచి పాత బస్‌స్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ నివేదికను బహిర్గతం చేయాలని, సీపీఎస్‌ని రద్దుచేయాలని, కాంట్రాక్టు/ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. వివిధ సంఘాల నాయకులు  బౌడు గంగరాజు, యూవీ గిరి, పనసల ప్రసాద్‌, లోచలి చిట్టినాయుడు, దేపూరి శశి కుమార్‌, కేవీ రమణ, గెమ్మెలి మోహన్‌, కిట్లంగి పెద్దబ్బాయి, పాతూను రామరాజు, రెడ్డి వెంకటేశ్వర్లు, శెట్టి సూరిబాబు, చింతర్ల సాగర్‌, గసాడి పద్మనాభం, లోచలి రామకృష్ణ పాల్గొన్నారు. 


అరకులోయ: రాష్ట్ర పీఆర్‌సీ సాధన సమితి కమిటి మేరకు అరకులోయలో నిరసన ర్యాలీ చేశారు. నాలుగురోడ్ల జంక్షన్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.  ఈ సందర్భంగా ఎస్‌టీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు కోడ సింహాద్రి మాట్లాడుతూ, కొత్త పీఆర్సీని రద్దు చేయాలని, అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని, జనవరి నెలకు పెండింగ్‌ డీఏలతోపాటు పాత జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాలకు చెందిన  వై.పెంటయ్య, బి.ధనుర్జయ్‌, జి.చిట్టిబాబు, ఈశ్వరరావు, టి.చిట్టిబాబు, లక్ష్మణ్‌, జీవీ రాంబాబు, ఎం.నారాయణ తదితరులు పాల్గొన్నారు.


అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈఆర్‌సీని నిరసిస్తూ ఉద్యోగులు  స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సుమారు రెండు గంటలపాటు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన జడ్పీటీసీ సభ్యుడు దీసరి గంగరాజు మాట్లాడుతూ, చీకటి జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రాన్ని అందించారు. పీఆర్‌సీ సాధన సమితి ప్రతినిధులు ఎస్‌.రాంబాబు, మండి నాగేశ్వరరావు, రామకృష్ణ, మల్లేశ్వరరావు, మల్లీశ్వరి, సూర్యకాంతం, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.


డుంబ్రిగుడ: పీఆర్‌సీ జీవోలను రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని పీహెచ్‌సీ కాంట్రాక్టు సిబ్బంది డిమాండ్‌ చేశారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించారు. హెల్త్‌ సిబ్బంది శౌరి, స్వామి, హరికృష్ణ, రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.


ముంచంగిపుట్టు: పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిరసన ర్యాలీ జరిగింది. చీకటి జీవోలను రద్దు చేయాలని, పాత జీతాలే ఇవ్వాలని నినాదాలు చేశారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు ఎం.రామకృష్ణ, జి.కృష్ణమూర్తి, పి.నాగేశ్వరరావు, బి.బాబూరావు, ఎం.మాణిక్యాలరావు, తదితరులు పాల్గొన్నారు. 


కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మనెంట్‌ చేయాలి

పాడేరురూరల్‌: కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మనెంట్‌ చేయాలని  సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శంకరరావు డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌ కూడలిలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ,  సీఎం జగన్మోహన్‌రెడ్డి... రివర్స్‌ టెండరింగ్‌ తరహాలో రివర్స్‌ పీఆర్సీ ఇచ్చారని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు రివర్స్‌ గేర్‌లో ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపింస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీహెచ్‌.నాగరాజు, నేతలు లక్ష్మణ్‌, దొర మూర్తి, ఎలీషారావు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-27T06:24:28+05:30 IST