Advertisement
Advertisement
Abn logo
Advertisement

పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌

నాయుడుపేట : గురుకుల పాఠశాల, కళాశాల ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తున్న ఉపాధ్యాయులు

నాయుడుపేట, డిసెంబరు 8: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని గురుకుల ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. నాయుడుపేట ఎల్‌ఏసాగరంలోని గురుకుల పాఠశాల,  కళాశాల ఉద్యోగులు బుధవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ పీ విశ్వరాణి,  బల్లి బలరామిరెడ్డి, సూరిబాబు, వీరాసాహెబ్‌, శేఖర్‌, సుబ్బారావు, నాగమణి, ఆనందరావు, ఖాదర్‌బాషా,  రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement