కొండరాజులబాబు ఉత్సవాలకు శ్రీకారం

ABN , First Publish Date - 2021-02-27T05:34:19+05:30 IST

ప్రత్తిపాడు, ఫిబ్రవరి 26: ప్రత్తిపాడు సబ్‌ప్లాన్‌ ఏజన్సీ గిరిపుత్రుల ఆర్యాధ్యదైవం కొండరాజులబాబు ఉత్సవాలకు 20ఏళ్ల తరువాత మళ్లీ శ్రీకారం చుట్టారు. మండలంలోని ఈ-గోకవరం గ్రామం వద్ద 1969లో నిర్మించిన కొండరాజులబాబు ఆలయం వద్ద 30 సంవత్సరాలకు పైగా ఏటా ఉత్సవాలు

కొండరాజులబాబు ఉత్సవాలకు శ్రీకారం
ఈ-గోకవరంలో కొండరాజులబాబు విగ్రహాలు

ప్రత్తిపాడు, ఫిబ్రవరి 26: ప్రత్తిపాడు సబ్‌ప్లాన్‌ ఏజన్సీ గిరిపుత్రుల ఆర్యాధ్యదైవం కొండరాజులబాబు ఉత్సవాలకు 20ఏళ్ల తరువాత మళ్లీ శ్రీకారం చుట్టారు. మండలంలోని ఈ-గోకవరం గ్రామం వద్ద 1969లో నిర్మించిన కొండరాజులబాబు ఆలయం వద్ద 30 సంవత్సరాలకు పైగా ఏటా ఉత్సవాలు నిర్వహించి 2001వ నుంచి నిర్వహించకుండా వదిలివేశారు. సుదీర్ఘకాలం తర్వాత ఈ కొండరాజులబాబు ఆలయం వద్ద తిరిగి శుక్రవారం జాతర మహోత్సవం నిర్వహించారు. గ్రామ సర్పంచ్‌ వనపర్తి నాగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ బెన్నోజు నాగేశ్వరరావు, అల్లిక సత్తిబాబు, అమ్మిరాజు, పోతురాజు, నాగార్జున ప్రత్యేక పూజలు నిర్వహించారు. సబ్‌ప్లాన్‌ ఏజన్సీ గ్రామాల గిరిజను లు ఆలయాన్ని సందర్శించి స్వామివార్లకు మొక్కులు చెల్లించారు. రెండు దశాబ్దల తరువాత కొండరాజులబాబుకు ఉత్సవాలు నిర్వహించడం పట్ల గిరిజనుల్లో హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం భారీ అన్నసంతర్పణతో ముగిసే ఈ ఉత్సవాల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2021-02-27T05:34:19+05:30 IST