ప్రారంభమైన జ్యోతి ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-04-17T04:44:06+05:30 IST

నందవరం చౌడేశ్వరీమాత జ్యోతి ఉత్సవాలు శుక్రవారం రాత్రి ప్రారంభయ్యాయి.

ప్రారంభమైన జ్యోతి ఉత్సవాలు

బన గానపల్లె, ఏప్రిల్‌ 16: నందవరం చౌడేశ్వరీమాత జ్యోతి ఉత్సవాలు శుక్రవారం రాత్రి ప్రారంభయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు చౌడేశ్వరీమాతకు ఉదయం అమ్మవారికి సహస్ర నామ కుంకుమార్చన, పసుపు కుంకుమ , పట్టువస్ర్తాల అలంకరణ, కార్యక్రమాలు సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. రాత్రి 8 గంటలలకు అనంతపురం ధర్మవరానికి చెందిన అభయహస్త సేవా సమితి ఆధ్వర్యంలో  అన్నమయ్య సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ  రాష్ర్టాల నుంచి భక్తులు తరలివచ్చారు. శుక్రవారం  అర్దరాత్రి 12 గంటలకు భాస్కరయ్య ఆచారి చౌడేశ్వరీ అమ్మవారికి దిష్టిచుక్క పెట్టిన అనంతరం జ్యోతి ఉత్సవాలు ప్రారంభ మయ్యా యని ఆలయ ఈవో రామానుజన్‌, ఆలయ చైర్మన్‌ పీఆ ర్‌ వెంకటేశ్వరరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పాణ్యం సీఐ గంగాధర బాబు ఆధ్వర్యంలో నందివర్గం  ఎస్‌ఐ జగదీశ్వరరెడ్డి, పాణ్యం, గడివేముల  పోలీస్‌ సిబ్బంది ఆధ్వర్యంలో భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. అలాగే ఆర్టీసీ వారు బనగానపల్లె, కర్నూలు, అనంతపురం జిల్లాలనుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు.


విశ్రాంతి గదుల ప్రారంభం
  నందవరం  చౌడేశ్వరీమాత ఆలయ సమీపంలో తొగటవీర క్షత్రియసంఘం ఆధ్వర్యంలో నిర్మించిన గదులను నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందారెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి  శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే, ఎంపీలకు ఆలయచైర్మన్‌ పీఆర్‌ వెంకటేశ్వరరెడ్డి, ఆలయ ఈవో రామానుజన్‌ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎంపీ, ఎమ్మెల్యేలు  చౌడేశ్వరీమాతను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.  కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ ఖైరూన్‌బీ, ఎంపీడీవో నాగప్రసాద్‌, పంచాయితీ సెక్రటరీ సతీశ్‌కుమార్‌రెడ్డి,  ఎస్‌ఐ జగదీశ్వరరెడ్డి, తులసిరెడ్డి, సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T04:44:06+05:30 IST