ప్రణాళికతో సాగుచేస్తే రైతే రారాజు

ABN , First Publish Date - 2022-07-09T06:40:45+05:30 IST

ప్రణాళికతో సాగుచేస్తే రైతే రారాజు

ప్రణాళికతో సాగుచేస్తే రైతే రారాజు

గుడివాడ, జూలై 8 : ప్రణాళికా బద్ధంగా సాగు చేసే రైతే రారాజని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ జన్ను రాఘవరావు పేర్కొన్నారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఎన్జీవో హోమ్‌లో శుక్రవారం నిర్వహించిన వేడుకల్లో ఆదర్శరైతులు కళ్లేపల్లి శంకరరావు, నవోదయ శ్రీని వాస్‌లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ, అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్‌.మనో హరరావు తిలకించారు. గుడివాడ ఎంపీడీవో రమణ, తహసీల్దార్‌ ఎం.శ్రీనివాసరావు, పశుసంవర్థక శాఖ డీఏహెచ్‌వో చంద్ర శేఖరరావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారిణి జె.జ్యోతి, మత్స్యశాఖ జెడీ శ్రీనివాస రావు, ఇతర శాఖల అధికారులు విజయలక్ష్మి, జ్యోతిరమణి,  విజయకుమారి,  నిమ్మగడ్డ రమాదేవి, నీలం మణిధర్‌, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

 రైతు సౌభాగ్యమే దేశ సౌభాగ్యమని లయన్స్‌ క్లబ్‌ గుడివాడ ప్రగతి అధ్యక్షుడు మల్లంపల్లి వెంకట్రావు పేర్కొన్నారు. స్థానిక ప్రణవాశ్రమం గోశాల వద్ద  శుక్రవారం రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదర్శరైతులు రామిశెట్టి వీరభద్రరావు, ఈడే వెంకటేశ్వరరావు, జోగి స్వామిలను సత్కరించారు. 

ఘంటసాల : ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వారి కృషి విజ్ఞాన కేంద్రంలో  రైతు దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి ఖరీఫ్‌లో వరి పంట ఏలా వేసుకోవాలో సూచనలు, సలహాలు శాస్త్రవేత్తలు అందజేశారు. శాస్త్రవేత్తలు డాక్టర్‌ వి.ప్రసూన, జె.యశ్వంత్‌ కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

ఆదర్శ రైతులకు సత్కారం

కూచిపూడి : రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకృతి వ్యవసాయ నిపుణులు పేకేటి సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో కాజలో పలువురు రైతులను శుక్రవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం  వల్ల ఉపయోగాలు, తక్కువ ఖర్చుతో మేలైన వ్యవసాయ ఉత్పత్తులను సాధించే విధానం గురించి వివరించారు. రైతులు తాతా నాగేశ్వరమ్మ, కాగిత శ్రీనివాసరావు, కొనకళ్ల అంకాలరావు, కొల్లూరి బాబు రావు, పేకేటి బాపిరెడ్డిలను ఘనంగా సత్కరించారు. 

 వరినాట్లపై క్షేత్రస్థాయి ప్రదర్శన

పమిడిముక్కల: వరిలో అధిక దిగుబడి సాధించేందుకు రైతులు యాజమాన్య  పద్ధతులు పాటించాలని ఏవో గణేష్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పైడికొండలపాలెంలో రైతు దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా వరినాట్లు వేసే పద్ధతిని క్షేత్రస్థాయి ప్రదర్శన చేశారు. కలుపు నివారణా చర్యలు తీసికోవాలని, నిర్ణీత మోతాదులో ఎరువు లు వేయాలని ఏవో రైతులకు సూచించారు. పశువైద్యుడు రామ్‌నరేష్‌, పీఏసీఎస్‌ అధ్యక్షుడు కోటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. 

పామర్రు : అన్నదాతల అభ్యున్నతి, ప్రజాశ్రేయేస్సు కోసమే జగనన్న ప్రభుత్వం పనిచేస్తుందని ఎంపీపీ దాసరి అశోక్‌కుమార్‌ అన్నారు. మండల పరిధిలోని నిమ్మకూరులో శుక్రవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్సాఆర్‌ రైతు దినోత్సవంలో  ముఖ్య అతిథిగా అశోక్‌ పాల్గొని మాట్లాడారు. ఇదే విధంగా పసుమర్రు, పామర్రు, ఉండ్రపూడి తది తర రైతుభరోసా కేంద్రాల్లో వైఎస్సాఆర్‌ రైతు దినోత్సవ వేడుకలు నిర్వహించారు.  

Updated Date - 2022-07-09T06:40:45+05:30 IST