ప్రకాశం బ్యారేజ్ ఇన్‌ఫ్లో 5 లక్షల63 వేల క్యూసెక్కులు

ABN , First Publish Date - 2020-10-19T14:39:29+05:30 IST

ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద ఇన్ ప్లో 5 లక్షల63 వేల క్యూసెక్కులు, ఔట్ ప్లో 5లక్షల 60 వేల క్యూసెక్కులుగా ఉంది.

ప్రకాశం బ్యారేజ్ ఇన్‌ఫ్లో 5 లక్షల63 వేల క్యూసెక్కులు

విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద ఇన్ ప్లో 5 లక్షల63 వేల క్యూసెక్కులు, ఔట్ ప్లో 5లక్షల 60 వేల క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు  కృష్ణా ఈస్ట్రన్ అండ్ వెస్ట్రన్ కాల్వలకు సాగునీటి అవసరాలకు 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పులిచింతల ప్రాజెక్ట్ నుంచి 5లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అలాగే ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉన్న మున్నేరు, వైరా, కట్టలేరు, కీసర వాగుల నుంచి 60 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు లోతట్టు ప్రాంతల ప్రజలు ఇంకా ముంపులోనే ఉంటూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరో రొండు రోజులు పాటు వరద ప్రవాహం కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-10-19T14:39:29+05:30 IST