బ్యారేజి దిగువకు 1,500 క్యూసెక్కులు

ABN , First Publish Date - 2020-12-06T04:31:51+05:30 IST

ఎగువ జలాశయాల నుంచి వరదనీటిని విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజి వద్ద అధికారులు నీటిని స్వల్పంగా దిగువకు వదులుతున్నారు.

బ్యారేజి దిగువకు 1,500 క్యూసెక్కులు

తాడేపల్లి టౌన్‌, డిసెంబరు 5: ఎగువ జలాశయాల నుంచి వరదనీటిని విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజి వద్ద అధికారులు నీటిని స్వల్పంగా దిగువకు వదులుతున్నారు. శనివారం సాయంత్రానికి. పులిచింతల ప్రాజెక్టు, బ్యారేజి ఎగువన ఉన్న వివిధ వాగుల నుండి 3,000 క్యూసెక్కుల వరదనీరు బ్యారేజి రిజర్వాయర్‌ వద్ద ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 1,500 క్యూసెక్కుల నీటి వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌ వద్ద 12 అడుగుల నీటిమట్టం కొనసాగిస్తూ మొత్తం 70 గేట్లలో 2 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 1,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు జేఈ దినేష్‌ తెలిపారు. 


పశ్చిమ డెల్టాకు 1,516 క్యూసెక్కులు


 దుగ్గిరాల, డిసెంబరు 5: ప్రకాశం బ్యారేజి నుంచి కృష్ణా పశ్చిమడెల్టాకు 1,516 క్యూసెక్కుల నీటిని శనివారం విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజివద్ద నీటిమట్టం 12.0 అడుగులు ఉండగా దిగువకు 1,474 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దుగ్గిరాల సబ్‌డివిజన్‌ నుంచి రేపల్లె కాలువకు 279, తూర్పు కాలువకు 30,  కొమ్మమూరు కాలువకు 1,126 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. 


Updated Date - 2020-12-06T04:31:51+05:30 IST