Abn logo
Nov 30 2020 @ 06:45AM

ప్రకాశం: శివాలయాల్లో భక్తుల రద్దీ

ప్రకాశం: కార్తీక సోమవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శైవలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. భారీగా క్యూలైన్లలో స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. పలు సముద్ర తీరాల వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు అన్ని శివాలయాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు. మాస్క్ ధరించడం, సామాజికదూరం పాటించేలాా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

Advertisement
Advertisement
Advertisement