Advertisement
Advertisement
Abn logo
Advertisement

Prakasam: చెరువును తలపిస్తున్న స్కూల్...విద్యార్థుల అవస్థలు

ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని జరుగుమల్లి మండలం, యన్.యన్. కండ్రిక పంచాయితీ, పీరాపురంలోని ఎంపీయూపీ స్కూల్‌కు వెళ్లేందుకు విద్యార్థుల అవస్థలు పడుతున్నారు. ఈరోజు ఉదయం నుండి కురుస్తున్న వర్షానికి పాఠశాల చెరువును తలపిస్తోంది.2013 నుండి వర్షం కురిస్తే స్కూలుకు వెళ్లే అవకాశం ఉండదని కలెక్టర్ స్థాయి అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదులు చేశారు. నాడు, నేడు కార్యక్రమంలో భాగంగా స్కూలును అభివృద్ధి చేశారు కానీ వెళ్లే దారిని అభివృద్ధి చేయలేదని గ్రామస్తులు చెబుతున్నారు. స్కూల్‌కి వెళ్లాలంటే చుట్టూ ఉన్న రహదారులన్నీ జలమయం కావటంతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నాటు పడవలైనా ఏర్పాటు చేయండని..లేక రోడ్లనైనా బాగు చేయండని గ్రామస్తులు వినతి చేస్తున్నారు.

Advertisement
Advertisement