దరల నియంత్రణలో పాలకులు విఫలం

ABN , First Publish Date - 2021-10-27T05:59:30+05:30 IST

గోరుచుట్టుపై రోకటి పోటులా నిత్యావసర వస్తువుల ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోయాయని ఏపీ మహిళా సమాఖ్య నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ అన్నారు.

దరల నియంత్రణలో పాలకులు విఫలం
కొత్తపేట నెహ్రుబొమ్మ సెంటర్‌లో అధిక ధరలపై ప్రజాబ్యాలెట్‌లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు

దరల నియంత్రణలో పాలకులు విఫలం

 ఏపీ మహిళా సమాఖ్య నగర ప్రధాన కార్యదర్శి దుర్గాంబ 

 కొత్తపేట నెహ్రూబొమ్మ సెంటర్‌లో ప్రజాబ్యాలెట్‌

వన్‌టౌన్‌, అక్టోబరు 26: గోరుచుట్టుపై రోకటి పోటులా నిత్యావసర వస్తువుల ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోయాయని ఏపీ మహిళా సమాఖ్య నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ అన్నారు. ధరలు నియత్రించడంలో పాలకులు వైఫల్యం చెందారని, రానున్న రోజుల్లో ప్రజాగ్రహం చవి చూడక తప్పదని ఆమె హెచ్చరించారు, మంగళవారం కొత్తపేట నెహ్రూ బొమ్మసెంటర్‌లో పెరిగిన ధరలను అదుపు చేయాలని కోరుతూ ప్రజాబ్యాలెట్‌ నిర్వహించారు. అధిక ధరలను అరికట్టాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇంతకు ముందెన్నడూ లేని విధంగా పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ,నూనెలు, విద్యుత్‌ ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గినా ఇక్కడ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నియంత్రించలేదని, అదేమంటే కొవిడ్‌ వ్యాక్సిన్‌కు వైద్యానికి, ఆహారానికి వ్యయం చేస్తున్నట్లుగా కేంద్రం చెప్పడం హాస్యాస్పదమన్నారు. వీటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురాలేమని కేంద్రమంత్రి నిర్మలా సీతారామ్‌ చెప్పడం బాధాకరమన్నారు. ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు మూలి సాంబశివరావు, తాడిపైడయ్య, కొట్టు రమణారావు, ఓర్సు భారతి, దుర్గాసి రమణమ్మ, చింతాడ పార్వతి, డి.పుష్పవతి, కల్యాణి, సింగరాజు సాంబశివరావు, గోవిందు, డి నారాయణ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు డిమాండ్‌ చేస్తూ నవంబరులో నిరాహార దీక్షలు చేయనున్నట్లు వక్తలు పేర్కొన్నారు.

Updated Date - 2021-10-27T05:59:30+05:30 IST