Pragyananda met Rajinikanth: రజనీకాంత్‏తో ప్రజ్ఞానంద భేటీ

ABN , First Publish Date - 2022-07-24T15:44:35+05:30 IST

రాష్ట్రానికి చెందిన ప్రముఖ చదరంగ ఆటగాడు ప్రజ్ఞానంద శనివారం సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth)ను స్థానిక తేనాంపేట పోయెస్‌ గార్డెన్‌లోని ఆ

Pragyananda met Rajinikanth: రజనీకాంత్‏తో ప్రజ్ఞానంద భేటీ

అడయార్‌(చెన్నై), జూన్ 23: రాష్ట్రానికి చెందిన ప్రముఖ చదరంగ ఆటగాడు ప్రజ్ఞానంద శనివారం సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth)ను స్థానిక తేనాంపేట పోయెస్‌ గార్డెన్‌లోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ విషయాన్ని ప్రజ్ఞానంద(Pragnananda) తన ట్విట్టర్‌ ఖాతాద్వారా వెల్లడించారు. ‘మరిచిపోలేని అనుభూతి. రజనీ అంకుల్‌ను కుటుంబ సభ్యులతో కలుసుకున్నాను. ఎంత ఎదిగినా ఒదిగివుండటం, ప్రోత్సాహంతో పాటు సంతోసాన్నిస్తుంది’ అని అన్నారు. కాగా, ఈ నెల 28వ తేదీ నుంచి చెన్నై(Chennai)లో జరుగనున్న చెస్‌ ఒలంపియాడ్‌(Chess Olympiad) పోటీల్లో భారత ‘బి’ జట్టు తరపున ప్రజ్ఞానంద బరిలోకి దిగుతున్నారు. కాగా, ఈ సందర్భంగా ఈ చెస్‌ క్రీడాకారుడికి సూపర్‌స్టార్‌ తన ఇష్టదైవమైన శ్రీ రాఘవేంద్రస్వామి చిత్రపటాన్ని బహూకరించారు. 

Updated Date - 2022-07-24T15:44:35+05:30 IST