కరెంట్‌ కోత.. నష్టాలు..

ABN , First Publish Date - 2022-05-23T05:28:32+05:30 IST

కరెంట్‌ కోత ఎప్పుడు విధిస్తారో తెలియదు.

కరెంట్‌ కోత.. నష్టాలు..
బయట పడేసిన పాల ప్యాకెట్స్‌

ఆకివీడు, మే 22: కరెంట్‌ కోత ఎప్పుడు విధిస్తారో తెలియదు. వేసవి ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడుతుంటే.. చిరు వ్యాపారులు నష్టం మూటగట్టుకుంటున్నారు. ఆకివీడులోని ఖాళీ స్థలంలో పాల ప్యాకెట్స్‌ పడేశారు. పాడైపోయిన పాల ప్యాకెట్‌లను పిల్లులు, కుక్కలు కూడా ముట్టలేదు. వాటిపై ఆరా తీస్తే సమీపంలోని వ్యాపారులు పడేసినట్లు తెలిసింది. దఫ దఫాలుగా కరెంట్‌ నిలిపివేయడంతో కూలింగ్‌ బాక్స్‌లో ఉంచిన పాలప్యాకెట్లు పాడైపోయాయి. వాటిని పడేయడం తప్ప మరో మార్గం లేదని వ్యాపారులు చెబుతున్నారు. పగలు, రాత్రులు అనే తేడా లేకుండా కరంటు కోత విధిస్తున్నారని పలువురు వాపోతున్నారు.

Updated Date - 2022-05-23T05:28:32+05:30 IST