పవర్‌ఫుల్‌ రికార్డుస్థాయిలో విద్యుత్‌ వినియోగం

ABN , First Publish Date - 2020-05-28T10:56:11+05:30 IST

జిల్లాలో రోజురోజుకూ ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. గత 5 రోజుల నుంచి జిల్లాలో 45 డిగ్రీలకు

పవర్‌ఫుల్‌ రికార్డుస్థాయిలో విద్యుత్‌ వినియోగం

రోజురోజుకూ పెరుగుతున్న వినియోగం

జిల్లాకు నిరే ్ధశించిన కోటా 3.98 మిలియన్‌ యూనిట్లు      

గరిష్టంగా 5.46 మిలియన్‌ యూనిట్ల వాడకం

మూడు నెలల్లోనే రెండు రెట్లు పెరిగిన విద్యుత్‌ సరఫరా     

గృహ అవసరాలు, సాగుకు పెరుగుతున్న డిమాండ్‌


కామారెడ్డి(ఆంధ్రజ్యోతి), మే 27: జిల్లాలో రోజురోజుకూ ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. గత 5 రోజుల నుంచి జిల్లాలో 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ ఎండ వేడిమికి ఉపశమనం పొందేందుకు జిల్లా ప్రజలు చల్లటి గాలి వచ్చే యంత్రాలకు పని చెబుతున్నారు. దీనికితోడు వ్యవసాయరంగానికి సైతం ఉచిత విద్యుత్‌ ఉండడంతో రబీ సీజన్‌లో విస్తృతంగా వరి పంటను సాగు చేయడంతో విద్యుత్‌ వినియోగం పెరిగింది. లాక్‌డౌన్‌ కొనసాగినప్పటికీ పరిశ్రమలు వాణిజ్య, వ్యాపార సముదాయల్లోనూ విద్యుత్‌ వినియోగం పెరిగిపోయింది. దీంతో జిల్లాకు నిర్ధేశించిన విద్యు త్‌ కోటాను మించి రెండు రెట్లు పెరిగిపోయింది. ప్రస్తుతం గరిష్టంగా 5.46 మిలియన్‌ యూనిట్లకు పైగానే విద్యుత్‌ వినియోగం అవుతున్న ట్లు సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో రికార్డు స్థాయిలోని విద్యుత్‌ వినియోగం అవుతు న్నట్లు విద్యుత్‌శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి.


జిల్లాలో 3.65 లక్షల విద్యుత్‌ కనెక్షన్‌లు

జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్‌ల పరిధిలో మొత్తం 3,65,517 విద్యుత్‌ కనెక్షన్‌లు ఉన్నాయి. ఇందులో కేటగిరి-1 గృహ అవసరాల కనెక్షన్‌లు 2,35,878 ఉండగా, కేటాగిరి-2లోని కమర్షి యల్‌ పరిశ్రమల కనెక్షన్‌లు 18,415 ఉండగా, నాన్‌ కమర్షిల్‌ వాణిజ్య సముదాయల కనెక్షన్‌లు 1405 ఉన్నాయి. వ్యవసాయ కనెక్షన్‌లు 92,979 ఉన్నాయి. ఈ మొత్తం కనెక్షన్‌లకు జిల్లాలో 3.98 మిలి యన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగానికి కోటా ఉంది. ఈ వేసవిలో కోటాకు మించి అత్యధికంగా విద్యుత్‌ వినియో గం అయినట్లు తెలుస్తోంది.


వేసవిలో  గృహ అవసరాలకు పెరిగిన విద్యుత్‌ వినియోగం

జిల్లాలో వేసవికాలం సందర్భంగా విద్యుత్‌ విని యోగం క్రమంగా పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 1,35, 166 గృహ అవసరాల విద్యుత్‌ కనెక్షన్‌లు ఉన్నాయి. ఎండ వేడి పెరుగుతున్న కొద్ది గృహ అవసరాలకు కరెంట్‌ వినియో గం ఆమంతం పెరుగుతోంది. ఫ్యాన్‌లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు ఇలా రకరకాలుగా వేడిమి నుంచి ఉపశమనానికి ప్రజలంతా సిద్ధం కావడం తో విద్యుత్‌ వినియోగం పెరుగుతోంది. అన్నదాతలు, యాసంగిలో జోరుగా వరి పంటను సాగు చేశారు. సాగునీటి కోసం రైతులు మోటా ర్లకు పెద్దఎత్తున పని చెప్పారు. ప్రభుత్వం సాగుకు ఉచితంగా 24 గంటల కరెంట్‌ సరఫరా చేస్తుండడంతో కర్షకులు ఆనందంగా పంటలు పండిస్తున్నారు. దీనికి తోడు వేసవిలో ఎండలు తీవ్రం కావడంతో ప్రజలంతా ఉపశమనానికి చర్యలు తీసుకుంటున్నారు. ఒక్క సారిగా గృహ అవసరాలకు వ్యవసాయ పరిశ్రమలు, వాణిజ్య వర్గాల నుంచి కరెంట్‌ వినియోగం పెరగడంతో జిల్లాలో రికార్డు స్థాయిలో విద్యుత్‌ వినియోగం అవుతోంది.


గరిష్టంగా 5.46 మిలియన్ల యూనిట్ల నమోదు

ఒక్కప్పుడు విద్యుత్‌ కోతలతో సతమతం అయ్యే దుస్థితి నుంచి రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ వెలుగులు ఇప్పటికీ వ్యాప్తి చెందుతున్నా యి. రాష్ట్రంలో, జిల్లాలో విద్యుత్‌ కోతలు అంతగా లేవు. విద్యుత్‌ విని యోగం సైతం భారీగానే పెరిగింది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌ ప్రభుత్వం ఇస్తుండడంతో బోరుబావుల ద్వారా పంటలకు సాగునీటిని అందించేందుకు విద్యుత్‌ వాడకం ఎక్కువవుతోంది. జిల్లాలో మొత్తం 3.65 లక్షల విద్యుత్‌ కనెక్షన్‌లు ఉండగా ఇందుకు గాను 3.98 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కోటాగా ఎన్‌పీడీసీఎల్‌ నిర్ధేశించగా ప్రజలు వినియోగం పెరగడంతో రోజువారి వాడకం అవుతున్న విద్యుత్‌ రికార్డు స్థాయిలో గరిష్టంగా 5.46 మిలియన్‌ యూనిట్లు నమోదు కావడం విశేషం. వ్యవసాయానికి, గృహ అవసరాలకే అత్యఽధికంగా విద్యుత్‌ వాడకం అవుతున్నట్లు తెలుస్తోంది.


కోతలు లేని విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం..శేషారావు, ఎస్‌ఈ.

జిల్లాలో కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. వేసవికాలం కావడంతో జిల్లాలో విద్యుత్‌ వినియోగం మరింత రెట్టింపు అయింది. ఏప్రిల్‌ వరకు పంటలు సాగవడంతో వ్యవసాయరంగానికి కోతలు లేకుండా విద్యుత్‌ను సరఫరా చేశాం. గృహ అవసరాలకు సైతం విద్యుత్‌ వినియోగం పెరుగుతోంది.

Updated Date - 2020-05-28T10:56:11+05:30 IST