రోడ్డుకు ఇరువైపులా మట్టి పోయాలి : సీపీఐ

ABN , First Publish Date - 2022-05-23T06:11:29+05:30 IST

మండలంలోని అనంతారం నుంచి బొమ్మలరా మారం మండలం వరకు బీటీరోడ్డు నిర్మించినా రోడ్డుకు ఇరువైపులా మట్టి పోయకపోవడంతో వాహనాదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏశాల అశోక్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డుకు ఇరువైపులా మట్టి పోయాలి : సీపీఐ
బీటీ రోడ్డు వద్ద నిరసన తెలుపుతున్న సీపీఐ నాయకులు

భువనగిరి రూరల్‌, మే22: మండలంలోని అనంతారం నుంచి బొమ్మలరా మారం మండలం వరకు బీటీరోడ్డు నిర్మించినా రోడ్డుకు ఇరువైపులా మట్టి పోయకపోవడంతో వాహనాదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏశాల అశోక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని అనంతారం శివారులోని అస్తవ్యస్తంగా ఏర్పాటు చేసిన బీటీరోడ్డు నిర్మాణం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్‌అండ్‌బీ అధికారులు కుమ్మక్కై అస్తవ్యస్తంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారన్నారు. లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కలెక్టర్‌, ఆర్‌అండ్‌బీ అధికారులు వెంటనే స్పందించి రహదారికి ఇరువైపులా మట్టి పోసి వాహనదా రులు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ముదిగొండ రాములు, నాయకులు సోమన అయిలయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-23T06:11:29+05:30 IST