పౌల్ర్టీ కుదేలు

ABN , First Publish Date - 2022-05-18T05:41:05+05:30 IST

నిర్వహణ ఖర్చులు పెరగడం, అందుకు అనుగుణంగా ధర లభించకపోవడంతో పౌలీ్ట్ర పరిశ్రమ కుదేలవుతోంది. సాధారణంగా ఏడాదిలో మూడు నెలలు పౌలీ్ట్ర పరిశ్రమ ఆశాజనకంగా ఉంటుంది.

పౌల్ర్టీ కుదేలు

నిర్వహణ ఖర్చు రూ.150, రిటైల్‌ ధర రూ.150

వృథా అవుతున్న శ్రమ

నష్టాలబాటన పౌలీ్ట్ర రైతులు


కోదాడ: నిర్వహణ ఖర్చులు పెరగడం, అందుకు అనుగుణంగా ధర లభించకపోవడంతో పౌలీ్ట్ర పరిశ్రమ కుదేలవుతోంది. సాధారణంగా ఏడాదిలో మూడు నెలలు పౌలీ్ట్ర పరిశ్రమ ఆశాజనకంగా ఉంటుంది. మిగతా తొమ్మిది నెలల పాటు అటు ఇటుగా పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం వేసవి కావడంతో చికెన్‌ అమ్మకాలు తగ్గగా, దాణా ధర, విద్యుత్‌ చార్జీలు, కోడి పిల్లల ధర పెరగడంతో పౌలీ్ట్ర రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. కోళ్ల పెంపకానికి అయ్యే ఖర్చు, వచ్చే ఆదాయానికి సరిపోతుండటంతో శ్రమ వృథా అవుతుందని పౌలీ్ట్ర రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఉమ్మడి జిల్లాలో వ్యవసాయం తరువాత పెద్ద పరిశ్రమగా పౌలీ్ట్ర ఉంది. సుమారు 1.20లక్షల పౌలీ్ట్రఫాంలు ఉండగా,దాదాపు 150కోట్ల కోళ్ల పెంపకం అవుతోంది. కిలోకోడి పెంపకానికి ఖర్చు రూ.150 వస్తుండగా, రిటై ల్‌ ధర రూ.150గా ఉంది. దీంతో ఆదాయం లేకపోగా, సీజనల్‌ వ్యాధులతో కోళ్లు చనిపోతుండటంతో నష్టాలు తప్పడం లేదని పౌలీ్ట్ర రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క పక్క పెరుగుతున్న దాణా రేటు, తగ్గిన చికెన్‌ వినియోగం, ధర లేమి, సీజనల్‌ వ్యాధులతో అల్లాడుతుండగా, పౌలీ్ట్ర పరిశ్రమకు ప్రభుత్వం ప్రకటించిన విద్యుత్‌ చార్జీలో 2 శాతం రాయితీ అమలు కావడం లేదు. ఫలితంగా ఒక్కో పౌలీ్ట్రఫాం నెలకు రూ.10వేలకు పైగా బిల్లు చెల్లించాల్సి వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. పౌలీ్ట్ర పరిశ్రమ కోలుకోవాలం టే సబ్సిడీపై దాణా అందజేయడంతోపాటు, విద్యుత్‌ చార్జీల్లో రాయితీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.


పెరిగిన దాణా ధర

ఉమ్మడి జిల్లాలో 1.20లక్షల పౌలీ్ట్రఫాంలు ఉండగా, 150కోట్ల కోళ్ల పెంపకం అవుతోంది. వీటిపై ప్రత్యక్షంగా 15వేలమంది, పరోక్షంగా మరో30వేల మంది ఉపాధి పొందుతున్నారు. కోళ్ల పెంపకానికి మొక్కజొన్న, సో యా దాణాను అధికంగా వాడుతుంటారు. మొక్కజొన్న దాణా టన్నుకు ఏడాదిలో రూ.18వేల నుంచి రూ.25వేలు, సోయా రూ.50వేల నుంచి రూ.80వేలకు పెరిగింది. దీంతో దాణా ఖర్చు రెట్టింపైంది. అదే స్థాయిలో కోడి ధర పెరగకపోవడంతో నష్టాలు వస్తున్నాయని పౌలీ్ట్ర రైతులు వాపోతున్నారు.


నిర్వహణ ఖర్చు ఇలా

సాధారణంగా రెం డు కిలోల కోడిగా ఎదిగేందుకు రెండు నెలల సమయం పడుతుంది. ఈ కాలంలో కోడి మూడున్నర కిలోల దాణా తింటుంది. కిలో దాణాకు రూ.60 వ్యయం అనుకుంటే, మూడున్న ర కిలోలకు రూ.210 వరకు ఖర్చు వస్తుంది. కోడి పిల్ల ధర రూ.35. లేబర్‌ చార్జీ రూ.6,మెడిసిన్‌ ఖర్చు రూ.10, కరెంట్‌ బిల్లు రూ.1, వరిపొట్టుకు రూ.5,ఇతర ఖర్చులు రూ.3, ట్రేడర్‌ తరుగుదల కింద రూ.40, మొత్తంగా రెండు కిలోల కోడి పెంపకానికి రూ.300 ఖర్చు వస్తోం ది. కిలో కోడికి రూ.150 ఖర్చు వస్తుండగా, మార్కెట్‌ లో రిటైల్‌ కోడి ధర రూ.150గా ఉంది. అంటే కోడి పెం పకంతో లాభం లేదు. చేసిన శ్రమకు ఫలితం లేకుండాపోతోందని రైతులు వాపోతున్నారు. ఫాంలో 10వేల కోళ్లను పెంచితే కోడికి(2కిలోలు) రూ.300 చొప్పున రెండు నెలలకు సుమారు రూ.30లక్షల ఖర్చు వస్తోంది. ఏడాదికి రూ.1.80కోట్లు నిర్వహణ వ్యయం అవుతోంది. కిలో కోడి రూ.150 చొప్పున విక్రయిస్తే రైతుకు లాభం ఉండదు. అంతకంటే తగ్గితే నష్టం వస్తుంది. ప్రభుత్వం నిర్దిష్ట రేటు రూ.160 నిర్ణయిస్తే కిలోకు రూ.10 లాభం వస్తుంది. అయితే మార్కెట్‌లో రేట్ల మార్పుతో పౌలీ్ట్ర రైతులకు నష్టమే మిగులుతోంది.


సీజనల్‌ వ్యాధులతో నష్టం

వేసవిలో ఉష్ణోగ్రత 30డిగ్రీలు దాటితే కోళ్లకు చల్లదనం ఏర్పాట్లు చేయాలి. ఈ సమయంలో విద్యుత్‌ కోతలు ఉంటే కోళ్లు చనిపోతాయి. అంతేగా క చలికాలంలో ఐబీఎస్‌ వైరస్‌, గంబోరా వంటి వ్యాధులతో సుమారు 10నుంచి 12శాతం కోళ్లు మృత్యువాతపడతాయి. సీజనల్‌ వ్యాధులు పౌలీ్ట్ర రైతులను నష్టానికి గురిచేస్తున్నాయి. ఒక్క వర్షాకాలం మాత్రమే కోళ్ల పెంపకానికి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో కోడి రేటు అంతగా ఉండదు. ఫలితంగా అన్ని సీజన్లలో నష్టాలు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉండా, కరోనాకు ముందు దాణా రేటు తక్కువగా ఉండటంతో ఖర్చు తగ్గి పౌలీ్ట్ర రైతులు లాభాలు పొందారు. అయితే కరోనా అనంతరం దాణా, ఇతర ఖర్చులు రెండింతలు పెరగడం, కోడి ధర మాత్రం అంతే ఉండటంతో పెట్టుబడికి తగ్గ ఆదాయం రాక నష్టపోతున్నారు.


విద్యుత్‌శాఖ రాయితీ ఇస్తే కాస్త ఊరట

పౌలీ్ట్రరంగం ఆటుపోట్లను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా క్షేత్రస్థాయిలో అది అమలవడం లేదు. కోళ్ల పరిశ్రమ పెద్ద తరహా పరిశ్రమకిందకు రాదని, వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా గుర్తించి విద్యుత్‌ బిల్లులో 2శాతం రాయితీ ఇవ్వాలని విద్యుత్‌శాఖకు ప్రభుత్వం సూచించింది. దీనికి ఆశాఖ నుంచి స్పందన లేకపోవడంతో లక్షల రూపాయలు విద్యుత్‌ బిల్లుగా చెల్లిస్తున్నామని పౌలీ్ట్ర రైతులు పేర్కొంటున్నారు. విద్యుత్‌ సంస్థ నుంచి రాయితీ అమలుచేస్తే రూ.10వేల వరకు ఆదా అవుతుంది. 


ఎస్‌ఎస్‌ సర్టిఫికెట్‌ ఉంటే రాయితీ

పౌలీ్ట్రఫాం నిర్వాహకులకు ఎస్‌ఎ్‌స(స్మాల్‌స్కేల్‌) సర్టిఫికెట్‌ ఉంటే విద్యుత్‌శాఖ 2శాతం రాయితీ ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే 500 కోళ్లలోపు ఉన్న పరిశ్రమలకే ఎస్‌ఎస్‌ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. అయితే 500 కోళ్లకంటే ఎక్కువ పెంపకం చేపడుతున్న పౌలీ్ట్రలే అధికంగా ఉన్నాయని, అన్నింటికీ రాయితీ వర్తింపజేయాలని రైతులు కోరుతున్నారు.


దాణాపై సబ్సిడీ ఇవ్వాలి : షేక్‌ రెహమాన్‌, పౌలీ్ట్ర రైతు

కోళ్ల పెంపకానికి అవసరమై న దాణా మొక్కజొన్న, జొన్న లు, చీర్‌, సోయా దాణాపై సబ్సిడీ ఇవ్వాలి. అదేవిధంగా విద్యుత్‌ బిల్లు లో రాయితీ ఇవ్వాలి. బ్యాంకుల నుంచి సబ్సిడీపై రుణా లు ఇస్తేనే తప్ప పౌలీ్ట్ర మనుగడ కష్టం. పౌలీ్ట్ర రైతులకు నష్టం మిగులుతుండగా, చికెన్‌ విక్రయదారుల పరిస్థితి మాత్రం మెరుగ్గా ఉంది. కిలో కోడి రూ.150కు తీసుకె ళ్తే, రూ.200నుంచి రూ.250 వర కు కిలో చికెన్‌ విక్రయిస్తున్నారు. రైతు ఉత్పతి చేసిన కోడికి మాత్రం ధర ఉండదు, వ్యాపారి విక్రయించే చికెన్‌కు మాత్రం మార్కెట్‌లో ధర ఉంటుంది. ఇప్పటికైనా పౌలీ్ట్ర పరిశ్రమను ఆదుకోకుంటే ఈ రంగం పూర్తిగా మూతపడుతుంది. అంతేగాక దీనిపై ఆధారపడిన వేలాది మంది రోడ్డునపడతారు.


Updated Date - 2022-05-18T05:41:05+05:30 IST