పోట్రాన్‌ వైర్‌లెస్‌ నెక్‌బ్యాండ్‌

ABN , First Publish Date - 2022-06-04T08:56:32+05:30 IST

ప్లేటైమ్‌ అరవై గంటలతో ‘పోట్రాన్‌’ - వైర్‌లెస్‌ నెక్‌బ్యాండ్‌ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది.

పోట్రాన్‌ వైర్‌లెస్‌ నెక్‌బ్యాండ్‌

ప్లేటైమ్‌ అరవై గంటలతో ‘పోట్రాన్‌’ - వైర్‌లెస్‌ నెక్‌బ్యాండ్‌ మార్కెట్లోకి  ప్రవేశిస్తోంది. టాంజెంట్‌ అర్బన్‌ పేరిట వస్తున్న  ఇది పోట్రాన్‌కు సంబంధించి సరికొత్త ప్రీమియర్‌ ప్రొడక్ట్‌. గేమింగ్‌లో అరుదైన అనుభవాన్ని ఇస్తుంది. ఎన్విరాన్‌మెంట్‌ నాయిస్‌ కేన్సలేషన్‌కు డీఎస్సీ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఆరంభ ధర రూ.799. ముందే పేర్కొన్నట్టు అరవై గంటల సేపు ప్లే టైమ్‌కు తోడు బ్లూటూత్‌ వి5.3 అందునా పది మీటర్ల రేంజ్‌ కలిగి ఉంది. 37 గ్రాముల బరువే ఉన్న ఇది మెటాలిక్‌ ఫినిష్‌తో రూపొందింది. బిల్ట్‌ ఇన్‌ రీచార్జబుల్‌ లై పాలిమర్‌తో 400 ఎంఎహెచ్‌ బ్యాటరీ కలిగి ఉంది.  పది మి.మీ. సైజుతో డైనమిక్‌ బాస్‌ బూస్ట్‌ డ్రైవర్‌ ఉన్నాయి. చార్జింగ్‌ టైమ్‌ రెండు గంటలు కాగా ఐపీఎక్స్‌4 వాటర్‌ రెసిస్టెన్స్‌ ఉంది. ఇది అమెజాన్‌లో లభ్యమవుతుంది. 

Updated Date - 2022-06-04T08:56:32+05:30 IST