Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆంధ్రకేసరి యూనివర్సిటీలో పోస్టులు భర్తీ చేయాలి

(కలెక్టరేట్‌), నవంబరు 28 : ఒంగోలులో ఏ ర్పాటు చేసిన ఆంధ్రకేసరి యూనివర్శిటీలో వెంటనే తరగతులు ప్రారంభించడంతో పాటు వైఎస్‌ఛాన్సలర్‌, ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌  రాష్ట్ర సహాయ కార్యదర్శి శివారెడ్డి డిమాండ్‌ చేశారు. ఆ దివారం స్థానిక మల్లయ్యలింగంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రకేసరి యూనివర్శిటీకి ప్రభుత్వం నిధులు కేటా యించాలన్నారు. అలాగే రామాయపట్నం పోర్టును త్వరగా పూర్తి చేసి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాల ని, ఎయిడెడ్‌ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోలను రద్దు చేయాలని డి మాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగాఉన్న ఉద్యోగాల ను భర్తీచేసేందుకు నూతన జాబ్‌ క్యాలెండర్‌ను విడు దల చేసి పెండింగ్‌ ఫీజు రీఎంబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ లను విడుదల చేయాలన్నారు. నూతన జాతీయ విద్యా విదానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 

ఏఐఎస్‌ఎఫ్‌ నూతన కార్యవర్గం 

ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నూతన  కార్యవర్గాన్ని ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పి.నాగేంద్రబాబు, ప్రధానకార్యదర్శిగా సీహెచ్‌.లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షులుగా ప్రదీప్‌, నాగేంద్రబాబు, రాజమోహన్‌రెడ్డి, ఆర్‌.సుమం త్‌, సహాయ కార్యదర్శులుగా కల్యాణ్‌, సీహెచ్‌.పవన్‌క ళ్యాణ్‌, శ్రీరాం ప్రభుదేవా, కోశాధికారిగా బ్రాహ్మణిలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో గోపి, సాయి, దయానం ద తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement