తపాలాశాఖ ప్రైవేటీకరణకు స్వస్తిపలకాలి

ABN , First Publish Date - 2022-08-11T05:33:13+05:30 IST

తపాలాశాఖను ప్రైవేటీకరణ చేసే పద్ధతికి కేంద్రం స్వస్తిపలకాలని ఆల్‌ ఇండియా పోస్టల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌- గ్రూప్‌ సీ కడప తపాలా కార్యాలయ విభాగం డివిజనల్‌ సెక్రటరీ జీవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు.

తపాలాశాఖ ప్రైవేటీకరణకు స్వస్తిపలకాలి
తపాలా కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేస్తున్న ఉద్యోగులు

ఏఐపీఈయూ గ్రూప్‌-సీ నేత సుబ్బారెడ్డి


కడప (మారుతీనగర్‌), ఆగస్టు 10: తపాలాశాఖను ప్రైవేటీకరణ చేసే పద్ధతికి కేంద్రం స్వస్తిపలకాలని ఆల్‌ ఇండియా పోస్టల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌- గ్రూప్‌ సీ కడప తపాలా కార్యాలయ విభాగం డివిజనల్‌ సెక్రటరీ జీవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. తపాలా శాఖను ప్రైవేటు పరం చేసేందుకు ఇటు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌, తపాలా డిపార్ట్‌మెంట్‌   తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. ఆ మేరకు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సిఫార్సులను చాపకింద నీరులా అమలు చేస్తున్న తీరు దారుణమన్నారు. ఇందుకు నిరసనగా తపాలాశాఖలోని పలు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం వన్‌టౌన్‌ సమీప తపాలా ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే తపాలా శాఖలో పీఎల్‌ఐ, ఆర్‌పీఎల్‌ఐ, పార్శిల్‌ డైరెక్టరేట్స్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే అన్నారు. డాక్‌మిత్రా ద్వారా సీసీఎస్‌ డిజిటల్‌ సేవా పోస్టల్‌ను ఉపయోగించి సీఎ్‌ససీవీఎల్‌ఈ(గ్రామస్థాయి వ్యవస్థాపకులు) ద్వారా స్పీడ్‌పోస్టు, రిగార్డ్‌, పార్శిల్స్‌ బుకింగ్‌ను కమీషన్‌ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించారని ఆరోపించారు. ఈ కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ స్కీమ్‌ ద్వారా లక్షల మందిని కమీషన్‌ పద్ధ తిలో నియమిస్తున్నారని, తద్వారా తపాలాశాఖ సునాయాసంగా ప్రైవేటుపరం చేసేందుకు సులభతరమవుతుందన్నారు. తపాలాశాఖలో లాభాలు తెచ్చే వాటిని విడగొట్టి పెట్టుబడుదారులకు ధారాదత్తం చేస్తే పోస్టల్‌శాఖకు చివరకు మిగిలేది ఆర్డినరీ లెటర్స్‌ రాకపోకలు మాత్రమే అన్నారు. తద్వారా తపాలాశాఖ నిలబడదన్నారు. తపాలాశాఖకు కూడా బీఎ్‌సఎన్‌ఎల్‌కు పట్టిన గతి తప్పదన్నారు. తపాలా శాఖలోని ఉద్యోగులు ఏక మై సమ్మెబాట పడతామని ప్రభుత్వానికి నోటీసులు జారీచేసిందన్నారు. అప్పటికీ ప్రభుత్వం తన పంతా విరమించుకోకపోతే నిరవధిక సమ్మె చేపట్టేందుకు సైతం తపాలాశాఖ కేంద్ర నాయకత్వం ఆలోచిస్తోందన్నారు. కార్యక్రమంలో తపాలా ఉద్యోగ సంఘ నాయకులు కె.రవికాంత్‌, డి.బషీర్‌, ప్రభాకర్‌, మునాఫ్‌, రామసుబ్బయ్య, తదితరలు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-11T05:33:13+05:30 IST