అక్రమ మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2020-05-29T09:23:16+05:30 IST

జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం పట్టుబడుతోంది. గుంటూరు ఆటోనగర్‌ పెట్రోల్‌ బంకు వద్ద చెక్‌పోస్టులో ద్విచక్ర ..

అక్రమ మద్యం స్వాధీనం

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, మే 28: జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం పట్టుబడుతోంది.  గుంటూరు ఆటోనగర్‌ పెట్రోల్‌ బంకు వద్ద చెక్‌పోస్టులో ద్విచక్ర వాహనంలో నాలుగు మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. చేబ్రోలు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చెక్‌పోస్టు వద్ద నగరానికి చెందిన అన్నపరెడ్డి దుర్గాప్రసాద్‌ ద్విచక్రవాహనం నుంచి 10 మద్యం బాటిళ్ళు స్వాధీనం చేసుకున్నారు. నల్లపాడు చెక్‌పోస్టు వద్ద పెన్నేరు బాబు అనే వ్యక్తి వద్ద 5 మద్యం బాటిళ్ళను స్వాదీనం చేసుకున్నారు. రూరల్‌ జిల్లా పరిధిలో గురువారం దాచేపల్లి, మాచర్లలో నలుగురిని అరెస్ట్‌ చేసి 81 మద్యం బాటిళ్ళు, రెండు వాహనాలు, కొల్లిపర మండలం చివలూరు సమీపంలో నూతక్కి గ్రామానికి చెందిన ముగ్గురు కారులో మద్యం అక్రమంగా తరలిస్తుండగా 40మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.


నూజెండ్ల మండలం చెన్నారెడ్డికాలనీలో సారా కాస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని 400లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నరసరావుపేటపరిధిలో 32 మద్యం సీసాలు, 15 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. గురజాల ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో నలుగురిని అరెస్టు చేసి 90 మద్యం బాటిళ్లు, బోయపాలెం వద్ద ఓ వ్యక్తి దగ్గర ఉన్న 10 బాటిళ్ల మద్యం పట్టుకున్నారు. కాకుమాను మండలం కొల్లిమర్ల, పాండ్రపాడు 21 సీసాలు స్వాధీనం చేసుకున్నారు.


ఇసుక... పేకాట

 అమరావతిలో అక్రమంగా  ఇసుక రవాణా చేస్తున్న ఆరుగురిని అరెస్ట్‌ చేసి నాలుగు లారీలు, ఒక జేసీబీని స్వా ధీనం చేసుకున్నారు. కొల్లూరు, మాచవరం, పెద కూరపాడులో పేకాడుతున్న 17 మందిని అరెస్టు చేసి 14 ద్విచక్రవాహనాలు, రూ.55 వేల 480 స్వాధీనం చేసు కున్నట్లు రూరల్‌ ఎస్పీ విజయరావు తెలిపారు. అర్బన్‌లోని నల్లపాడు పరిధిలోని తురకపాలెం ఎక్స్‌టెన్షన్‌లో పేకాడుతున్న ఐదుగురిని అరెస్ట్‌ చేసి రూ.34వేల 400, ఆరు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2020-05-29T09:23:16+05:30 IST