పార్టీ కోసం పనిచేస్తే ఇంటికే పదవులు

ABN , First Publish Date - 2021-10-19T06:17:35+05:30 IST

పార్టీ కోసం కష్టప డి పనిచేస్తే పదవులు ఇంటికే పరుగులు తీస్తూ వస్తాయని, దీన్ని గుర్తెరిగి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని టీడీ పీ అనంతపురం నియోజకవర్గ ఇనచార్జ్‌, మాజీ ఎమ్మెల్యే వై కుంఠం ప్రభాకరచౌదరి ఆ పార్టీ శ్రేణులకు సూచించారు.

పార్టీ కోసం పనిచేస్తే ఇంటికే పదవులు
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి

- బాధ్యతగా పనిచేసినపుడే గౌరవం

 : మాజీ ఎమ్మెల్యే  ప్రభాకరచౌదరి 

అనంతపురం వైద్యం, అక్టోబరు18: పార్టీ కోసం కష్టప డి పనిచేస్తే పదవులు ఇంటికే  పరుగులు తీస్తూ వస్తాయని, దీన్ని గుర్తెరిగి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని టీడీ పీ అనంతపురం నియోజకవర్గ ఇనచార్జ్‌, మాజీ ఎమ్మెల్యే వై కుంఠం ప్రభాకరచౌదరి ఆ పార్టీ శ్రేణులకు సూచించారు. పా ర్టీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం అనంతపురం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభాకరచౌదరి శ్రేణులను ఉద్దేశించి మాట్లాడు తూ... గెలుపోటములు సహజమని, వాటిని సమానంగా తీ సుకోవాలన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కో సం బాధ్యతగా పనిచేసినప్పుడే సమాజంలో గౌరవ ప్రతిష్టలు లభిస్తాయన్నారు. సంపద ఉన్న వాడికన్నా సామాజిక బాఽధ్య త ఉన్నవారికే అధిక గౌరవం దక్కుతుందన్నారు. మంచిగా ప నిచేసి మంచి నాయకులుగా మారితే పదవులు వాటంతకవే వస్తాయన్నారు. అయితే పదవులు ఇచ్చేటప్పుడు సామాజిక న్యాయం తదితర కారణాలతో కొందరికీ దక్కక ఉండవచ్చని అలా అని వారికి పార్టీలో గౌరవం లేదనుకోవడం మంచిది కాదన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తాను ముందుం టానన్నారు. ఏ పార్టీ వారైనా బంధువులు, స్నేహితులు కలి సినప్పుడు కరచాలనం చేసి, పలకరించడం సంప్రదాయ మన్నారు. అలాంటి వాటిని కూడా కొందరు తప్పుడు ప్ర చా రం చేసి తమపై బురద చల్లే ప్రయత్నాలు చేయడం సరికా దన్నారు. తన గురించి అధినేత చంద్రబాబుకు తెలుసన్నారు. అవకాశం ఉన్నప్పుడు పనిచేసినోళ్లు గట్టిగా అడగడం సహజ మేనని అయితే కొన్ని కారణాల వల్ల అవకాశాలు రాకపోతే బాధపడవద్దన్నారు. పనిచేసిన ప్రతి ఒక్కరికి పార్టీ తగిన గు ర్తింపు ఇస్తుందన్నారు. మనం అధికారంలో ఉన్నప్పుడు పార దర్శకంగా అందరికీ పథకాలు అందించామన్నారు. ఈ రోజు అర్హులకు ఉన్న పథకాలను కూడా నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నా రన్నారు. మరోవైపు వివిధ రూపాల్లో పన్నులు పెంచారని, క రెంటు బిల్లుల మోతమోగిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ప్ర జా వ్యతిరేక విధానాలతో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు ప డుతున్నారన్నారు. వైసీపీ అరాచకాలు, వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసి  వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. ఎవరికి అప్పగించిన బాధ్యతలు వారు చిత్తశుధ్దితో నిర్వహిస్తే వచ్చే ఎన్నికల్లో విజయం మనదేనని హితబోధ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు తలారి ఆదినారాయ ణ, దేవళ్ల మురళి, తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వప్న, మాజీ డిప్యూటీ  మేయర్‌ సాకే గంపన్న, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన సాలార్‌ బాషా, నాయకులు డిష్‌ నా గరాజు, సరిపూటి రమణ, వెంకటేష్‌గౌడ్‌, మాసూలు శ్రీనివా సులు, మారుతికుమార్‌గౌడ్‌, గుర్రం నాగభూషణం, మార్కెట్‌ మహేశ, దాసరి శ్రీధర్‌, నారాయణస్వామి యాదవ్‌, కాకర్ల ఆదినారాయణ, గోపాల్‌గౌడ్‌, బంగినాగ, రాయల కొండయ్య, బీటెక్‌ దాదు, పూల బాషా, నరసింహులు, హసీనా, విజయశ్రీ, చిట్రాజానకి, శివబాల, సరళతో పాటు పెద్దఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

టీడీపీలోకి వైసీపీ మైనార్టీ నాయకులు 

వైసీపీకి చెందిన మైనార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వైసీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి జేఎం బాషా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.  మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి సమక్షంలో సోమవారం తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకున్నారు. జేఎం బాషాతో పాటు మైనార్టీ నాయకు లు మహబూబ్‌ బాషా, షఫి, గంగాధర రాయల్‌కు ప్రభాక రచౌదరి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. 


Updated Date - 2021-10-19T06:17:35+05:30 IST