ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-05-24T06:31:55+05:30 IST

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ వనమాల చంద్రశేఖర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతు

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి
ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌

 అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌

నల్లగొండ, మే 23 : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ వనమాల చంద్రశేఖర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులను ఆయనతో పాటు డీఆర్‌వో జగదీశ్వర్‌రెడ్డిలు స్వీకరించారు.  ప్రజావాణి ఫిర్యాదులు 65 వచ్చాయని, ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించి 39 ఫిర్యాదులు రాగా జిల్లా పంచాయతీ అధికారికి సంబంధించి ఐదు ఫిర్యాదులు, గృహ నిర్మాణ శాఖకు సంబంధించి నాలుగు, మత్స్యశాఖకు సంబంధించి మూడు, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ శాఖకు సంబంధించి మూడు, స్త్రీ శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖకు సంబంధించి మూడు, ఎనిమిది దరఖాస్తులు ఇతర శాఖలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఆయా ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించి వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తామని అన్నారు.  

Updated Date - 2022-05-24T06:31:55+05:30 IST