పూర్ణాహుతిలో పాల్గొన్న శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర
పెందుర్తి, జనవరి 21: చినముషిడివాడలోని శారదా పీఠంలో ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు నిర్వహించనున్న వార్షికోత్సవాల నిర్వహణకు ముందుగా పీఠం ప్రాంగణంలో మూడు రోజులుగా చేస్తున్న వనదుర్గ యాగానికి శుక్రవారం పూర్ణాహుతి నిర్వహించారు. వనదుర్గ యాగానికి ఎంతో విశిష్టత ఉందని, శారదా స్వరూప రాజశ్యామల అంగ దేవత వనదుర్గ అని పీఠాధిపతి స్వరూపానందేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి పాల్గొన్నారు.