ఇళ్ల స్థలాలు కేటాయించాలని పేదల ధర్నా

ABN , First Publish Date - 2021-04-13T05:58:08+05:30 IST

పట్టణంలోని నిరు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఇల్లు లేని వారికి డబుల్‌బెడ్‌రూంలు కేటాయించి ఆదుకోవాలని సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అందించారు.

ఇళ్ల స్థలాలు కేటాయించాలని పేదల ధర్నా

ఆదిలాబాద్‌టౌన్‌, ఏప్రిల్‌ 12: పట్టణంలోని నిరు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఇల్లు లేని వారికి డబుల్‌బెడ్‌రూంలు కేటాయించి ఆదుకోవాలని సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు దేవేందర్‌ మాట్లాడుతూ 15 ఏళ్ల నుంచి  పట్టణంలోని దాజీశంకర్‌నగర్‌, శాస్ర్తీనగర్‌, కొము రంభీం కాలనీలో నివసిస్తున్నారన్నారు. 2014, 2015 సంవత్సరంలో అప్పటి కలెక్టర్‌ అహ్మద్‌బాబు వేరే చోట ఇండ్లు కట్టించి ఇస్తామని కాలనీలలో పేద ప్రజలు వేసుకున్న గుడిసెలను తొలగించేశారన్నారు. ఇప్పటికీ ఇళ్ల స్థలాల కోసం కలెక్టర్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా పేద ప్రజలకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కబ్జా చేసుకున్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-04-13T05:58:08+05:30 IST