Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆక్రమణల నుంచి చెరువులను కాపాడాలి

జిల్లా మత్స్యశాఖ అధికారికి వినతి పత్రం అందిస్తున్న సూర్యాపేట మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు

సూర్యాపేట సిటీ, నవంబరు 30: జిల్లాలో ఆక్రమణల నుంచి చెరు వులను కాపాడాలని సూర్యాపేట మత్స్య సహకారం సంఘం అధ్యక్షుడు సారగండ్ల కోటయ్య కోరారు.  ఈ మేరకు ఆ సంఘం సభ్యులతో జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్యను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేటలోని  పుల్లారెడ్డి, సద్దుల చెరువు, నల్లా చెరువుల భూములు 100 ఎకరాల వరకు పట్టణానికి చెందిన కొంతమంది రియల్‌ వ్యాపారులు ఆక్ర మించారన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆక్రమణకు గురైన చెరువు భూములను గుర్తించి, హద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి సందనబోయిన నాగరాజు, ఉపాధ్యక్షుడు నల్లమేకల వెంకన్న, కోశాధికారి ఇండ్ల సురేష్‌, కోల నిరంజన్‌, మోర జానకిరాములు, నల్లమేకల అంజయ్య, మారిపెద్ది ముత్తమ్మ, ఇండ్ల లక్ష్మి పాల్గొన్నారు.

అర్హత లేని సభ్యులను చేర్చడం సరికాదు

సూర్యాపేట టౌన్‌: గరిడేపల్లి మండలం రాయినిగూడెం మత్స్య కార్మిక సహకార సంఘంలో అర్హతలేని వ్యక్తులను చేర్చుకోవడం  సరికాదని ఆసంఘం సభ్యులు అన్నారు. సూర్యాపేటలోని  జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార శాఖ కార్యాలయం ఎదుట వారు నిరసన తెలిపి మాట్లాడారు.  రాయినిగూడెం మత్స్య కార్మిక సహకార సంఘానికి  త్వరలో ఎన్నికలు ఉన్నందున  సంఘ  మాజీ చైర్మన్‌  వాడపల్లి నర్సయ్య అనర్హులను సభ్యులుగా చేర్చుతున్నారన్నారు.. సంఘంలో 96 మంది సభ్యులు ఉండగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడన్నారు. సొసైటీకి నూతన చైర్మన్‌ నియమించాలని కోరారు.  దీనిపై ప్రభుత్వం విచారణ చేయించి అర్హులకు న్యాయం చేయాలని వారు కోరారు.


Advertisement
Advertisement