పొంచి ఉన్న ప్రమాదం!

ABN , First Publish Date - 2022-05-18T06:21:33+05:30 IST

పొంచి ఉన్న ప్రమాదం!

పొంచి ఉన్న ప్రమాదం!
పైపులైన్‌ కనెక్షన్‌ కోసం డ్రెయిన్‌ పక్కన తీసిన గుంత

  కుళాయి కనెక్షన్‌ కోసం తీసిన గుంత

  పైపులైన్‌ కలిపి గుంత పూడ్చని నగర పంచాయతీ వాటర్‌వర్క్స్‌ సిబ్బంది

  డ్రెయిన్లో మురుగు పైపులోకి లీకై తాగునీరు కలుషితం అయ్యే అవకాశం

ఉయ్యూరు,  మే 17 : స్థానిక షాదీఖానా సమీపాన వీరమ్మ ఇంటి వీధిలో మంచి నీటి కుళాయి కనెక్షన్‌ కోసం తీసిన గుంత తిరిగి పూడ్చకుండా వదిలివేయడంతో పక్కనే ఉన్న డ్రెయిన్‌ పొంగి మురుగునీరు మెయిన్‌ పైపులైన్‌లో కలిసే ప్రమాదం పొంచి ఉంది. ఈప్రాంతంలో కొత్తగా కుళా యి కనెక్షన్‌ కోసం సీసీరోడ్డుపక్కన, డ్రెయిన్‌ను ఆనుకుని గోతిని తీసి మెయిన్‌పై పులైన్‌కు కలిపి గోతిని తిరిగి పూడ్చకుండా వదిలివేశారు. నగర పంచాయతీ వాటర్‌ వర్క్స్‌ సిబ్బంది నిర్లక్ష్యంతో గుంతను పూడ్చకపోవడంవల్ల అడ్డుగాపెట్టిన మట్టి తెగి డ్రెయిన్‌లో మురుగునీరు పైౖపులైన్‌లో కలిసితాగునీరు కలుషితం అయ్యే అవకాశం ఉండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయం నగర పంచాయతీ   కమిషనర్‌ దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకోవటంలేదని  ఆ ప్రాంతవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా కుళాయి కోసం సీసీరోడ్డు పగుల గొట్టి పూడ్చకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు.  కాగా దీనిపై కమిషనర్‌ను వివరణ కోరేందుకు ఫోన్‌ ద్వారా ప్రయత్నించగా స్పందించలేదు. 

Updated Date - 2022-05-18T06:21:33+05:30 IST