Invalid Vote వివాదం : Shivsena ఎమ్మెల్యే పిటిషన్‌పై Election comission అభ్యంతరం

ABN , First Publish Date - 2022-06-15T20:49:47+05:30 IST

గతవారం ముగిసిన రాజ్యసభ ఎన్నికల్లో తన ఓటు చెల్లుబాటు కాదంటూ భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) తీసుకున్న నిర్ణయాన్ని

Invalid Vote వివాదం : Shivsena ఎమ్మెల్యే పిటిషన్‌పై Election comission అభ్యంతరం

ముంబై : గతవారం ముగిసిన రాజ్యసభ(Rajya sabha) ఎన్నికల్లో తన ఓటు చెల్లుబాటు కాదంటూ భారత ఎన్నికల సంఘం(ECI) తీసుకున్న నిర్ణయాన్ని రద్దుచేయాలంటూ బాంబే హైకోర్ట్‌(Bombay High Court)లో శివసేన ఎమ్మెల్యే సుహాస్ కండే(Suhas Kande) దాఖలు చేసిన పిటిషన్‌పై ECI ప్రాథమిక అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాలు చేస్తున్నారు కాబట్టి ఎలక్షన్ పిటిషన్(Election petion) దాఖలు చేయాలని సూచించింది. సుహాస్ కండే పిటిషన్‌పై బుధవారం వాదనలు జరిగాయి. ఈసీఐ, ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తరపున అడ్వకేట్ అభినవ్ చంద్రచూడ్ వాదనలు వినిపించారు. జస్టిస్‌లు ఎస్‌వీ గంగపుర్వాలా, ధీరజ్ సింగ్ థాకూర్‌లతో కూడిన డివిజన్ బెంచ్‌ వాదనలు విన్నది. తదుపరి విచారణను జూన్ 24కు వాయిదా వేసింది. 


ఇదీ వివాదం ..

మహారాష్ట్రలో ఖాళ్లీగా ఉన్న 6 రాజ్యసభ స్థానాలకు జూన్ 10న ఎన్నికల జరిగింది. శివసేన ఎమ్మెల్యే సుహాస్ కండే తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎలక్షన్ హాల్‌(ముంబైలోని విధాన్ భవన్)కు వెళ్లారు. బ్యాలెట్ పేపర్‌పై ఓటు ఆమోదాన్ని తెలిపారు. అయితే నిబంధనల ప్రకారం.. విప్ జారీ చేసిన శివసేన నేత సునీల్ ప్రభుకు ఆయన బ్యాలెట్ పేపర్ సూచించారు. అయితే సుహాస్ కండే తన పార్టీ నేతకు కాకుండా వేరే పార్టీ వ్యక్తికి బ్యాలెట్ పేపర్‌ను సూచించారని బీజేపీ ఆరోపించింది. ఇది  ఓటింగ్ ప్రక్రియను ఉల్లంఘించడమేనని బీజేపీ ఆరోపించింది. దీంతో సుహాస్ కండే ఓటు చెల్లుబాటు కాదంటూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అయితే తనను ఏమాత్రం సంప్రదించకుండా, వివరణ తీసుకోకుండా ఏవిధంగా ఓటు హక్కును రద్దు చేస్తారని సుహాస్ కండే ప్రశ్నించారు. ఈ మేరకు సవాలు  చేస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈసీ నిర్ణయం తన హోదాకు అవమానకరమని పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-06-15T20:49:47+05:30 IST