Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోశయ్య మృతికి రాజకీయ నేతల సంతాపం

రోశయ్య పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న మంత్రులు సబితారెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌)/చేవెళ్ల: రాజకీయ చతురుడు మాజీ ముఖ్య మంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల మంత్రులు, రాజకీయ పార్టీల నేతలు సంతాపం తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి రోశయ్య పార్డీవదేహంపై పూలమాల వేసి నివాళులు అర్పించారు. సీఎంగా, మత్రిగా, గవర్నర్‌గా ఉమ్మడి రాష్ట్రంలో సేవలందించారని కొనియాడారు. మంత్రి సత్యవసతి రాథోడ్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య నివాళి అర్పించారు. మాజీ హోంమంత్రి టి.దేవేందర్‌గౌడ్‌ రోశయ్య మృతికి సంతాపం వ్యక్తం చేశారు. రాజకీయ ఉన్నత విలువలకు కట్టుబడి మెలిగిన వ్యక్తి అని కొనియాడారు. రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా ఉన్నప్పుడు తన శాసనసభ ప్రసంగాల పుస్తకావిష్కరణ సభకు ముఖ్య అతిథిగా వచ్చారని గుర్తు చేశారు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌  నేత మల్‌రెడ్డి రంగారెడ్డి రోశయ్య మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు.


  • చేవెళ్లతో రోశయ్యకు అవినాభావ సంబంధం

దివంగతులైన మాజీ సీఎం రోశయ్యకు చేవెళ్లతో ఆవినాభావ సంబంధం ఉంది. సీఎం హోదాలో 2009 నవంబర్‌లో చేవెళ్ల వచ్చారు. షాబాద్‌ చౌరస్తాలో దివంగత సీఎం వైఎ్‌స.రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తమిళనాడు గవర్నర్‌గా ఉన్న సమయంలో వికారాబాద్‌లో ఆర్యవైశ్య మహాసభకు వెళ్తూ చేవెళ్ల ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో కొద్దిసేపు ఆగారు.  ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆయన్ను సన్మానించారు.  డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకట్‌స్వామి, నియోజకవర్గ నాయకులు సున్నపు వసంతం, ఆర్యవైశ్య సంఘం మండల నాయకులు రోషయ్య చేసిన అభివృద్ధి పనులను గుర్తుచేసుకున్నారు.

Advertisement
Advertisement