పొలిటికల్‌ హీట్‌

ABN , First Publish Date - 2022-08-07T05:25:58+05:30 IST

ఏలూరు నియోజకవర్గంలో ముందే ఎలక్షన్‌ ఫీవర్‌ మొదలైంది. పాదయాత్రలు, పరామర్శలతో ప్రతిపక్ష, విపక్ష పార్టీ నేతలు ఊపిరి సలపకుండా పనిచేస్తున్నారు. వాడవాడలా తిరుగుతూ ప్రజా సమస్యలపై పోరాడు తున్నారు.

పొలిటికల్‌ హీట్‌

జనంలోకి వెళుతున్న పార్టీలు 

వాడవాడల్లో టీడీపీ జోరు

బడేటి ప్రజా చైతన్య యాత్ర 

ప్రజా సమస్యలపై జనసేన పోరు

ఏలూరులో గడప తొక్కని వైసీపీ 

సీఎం సమీక్షలో చీవాట్లు


రాష్ట్రంలో 8 నియోజకవర్గాల్లో నేటికీ ‘గడప–గడపకు మన ప్రభుత్వం’ మొదలు పెట్టలేదు. అందులో ఏలూరు నియోజక వర్గం కూడా ఉంది. డిసెంబర్‌ దాకా ప్రజల్లో ఉండాలని చెబుతున్నా చెవికి ఎక్కించుకోవడం లేదు. పని తీరు మెరుగుపరుచుకోకపోతే 2024లో టిక్కెట్టు ఇచ్చే ప్రసక్తే లేదు.’’ గడప–గడప కార్యక్రమం రివ్యూపై సీఎం జగన్‌ ఇటీవల ఎమ్మెల్యే పనితీరుపై చేసిన వ్యాఖ్యలు.


టీడీపీ అధిష్టానం తలబెట్టిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం 50 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించారు. ప్రజల్లో తిరుగుతూ సమస్యలను తెలుసుకుంటూ కార్యక్రమాన్ని నిరాటంకంగా పూర్తి చేసిన జిల్లాల్లో ఏలూరు జిల్లా టాప్‌–5లో నిలిచింది. దీనికి తోడు ‘ప్రజా చైతన్య యాత్ర పేరిట మరోసారి కాళ్లకు చెప్పులు లేకుండా ఏలూరు నియోజకవర్గంలో ఆ పార్టీ ఇన్‌చార్జ్‌ చేస్తోన్న పాదయాత్రకు మంచి రెస్పాన్స్‌ వస్తున్నది..


ఎమ్మెల్యే ఇంటికి అతి చేరువలో ఉన్న రోడ్డుపై 15 మీటర్ల మేర భారీ గొయ్యి పడినా ఈ నాయకులు పూడిక చేయించ లేని దుస్థితిలో ఉన్నారు. 15 రోజుల్లోగా పని చేయక పోతే మేమే పూర్తి చేసి ప్రజల కష్టాలు తొలగిస్తాం.’’ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా జనసేన పార్టీ ఏలూరు ఇన్‌చార్జి రెడ్డి అప్పలనాయుడు అధికార పార్టీ నాయకులకు చేసిన సవాల్‌ ఇది..


(ఏలూరు – ఆంధ్రజ్యోతి )

ఏలూరు నియోజకవర్గంలో ముందే ఎలక్షన్‌ ఫీవర్‌ మొదలైంది. పాదయాత్రలు, పరామర్శలతో ప్రతిపక్ష, విపక్ష పార్టీ నేతలు ఊపిరి సలపకుండా పనిచేస్తున్నారు. వాడవాడలా తిరుగుతూ ప్రజా సమస్యలపై పోరాడు తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతు న్నారు. పెరిగిన అధిక ధరలు, చార్జీల బాదుడు, పన్నులతో వెన్ను విరుస్తోన్న తీరు, నాయకుల అక్రమ, అవినీతి చేష్టలు వగైరా దోపిడీలను ప్రజల కళ్లకు కడుతున్నారు. ‘బాదుడే– బాదుడు’ ద్వారా టీడీపీ ఏలూరు ఇన్‌చార్జి బడేటి చంటి గతంలోనే 50 రోజుల పాటు ప్రజల్లో తిరగ్గా ఇపుడు ప్రజా చైతన్యయాత్ర ద్వారా 50 డివిజన్ల ప్రజలను మళ్లీ కలు స్తున్నారు. మరోవైపు జనసేన నాయకుడు రెడ్డి అప్పల నాయుడు కూడా డివిజన్లలో తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. ఏ నాయ కుడు కావాలో ఆలోచిం చండి అంటూ ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నాయకులందరూ ఇలా కాళ్లరిగేలా తిరుగు తుంటే అధికార పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల నాని మాత్రం మూడు నెలలుగా తన ఇంటి గుమ్మం దాటలేకపోయారు. చివరకు సీఎం జగన్‌ చీవాట్లు పెడితే గానీ కార్యాచరణకు దిగలేదు. పని తీరు మారకపోతే టిక్కెట్టు ఇవ్వబోనన్న సీఎం హెచ్చరి కలతో చివరకు ఆగస్టు 8 నుంచి ‘గడప–గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 


జోరు మీదున్న సైకిల్‌ 

రోజుకో డివిజన్‌, పూటకో పేట చొప్పున టీడీపీ ఏలూరు ఇన్‌చార్జి బడేటి చంటి పాదయాత్రలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మరణానంతరం టీడీపీ తరఫున పనిచేస్తోన్న ఆయనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. నెల క్రితమే మొదటి దఫా కార్యక్రమంగా ఆ పార్టీ అధిష్టానం తలపెట్టిన బాదుడే–బాదుడు’ కార్యక్రమాన్ని చేపట్టారు. 50 డివిజన్లలోని ప్రజలను కలుస్తూ వారి సాదక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. తన రెండో దఫా కార్యక్రమానికి 15 రోజుల క్రితం శ్రీకారం చుట్టారు.ప్రతీ డివిజన్లోనూ మళ్లీ తిరుగుతూ పాదయాత్ర చేస్తున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఏలూరు కార్పొరేషన్‌ కమిషనర్‌, కలెక్టర్‌, ఇతర అధికారుల వద్దకు ఆ సమస్యలను తీసుకెళ్తూ పరిష్కారం కోసం పోరాడుతున్నారు. ప్రతీ అంశంలో అధికార పార్టీ వైఫల్యాలను వేలెత్తి చూపుతు న్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీ తీరుతో విసిగిపోయిన ప్రజలు టీడీపీ వైపు ప్రత్యామ్నాయ శక్తిగా నిర్ణయించుకున్నారు. ఈ తరుణంలో బడేటి పాద యాత్ర ఆ ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రజలు బహిరం గంగానే చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇలాగే 45 రోజుల పాటు కొనసా గించబోతున్నారు. కాగా తమ పాదయాత్రను చూసి ఎమ్మెల్యే ప్రజల్ని కలుసుకునేందుకు వెళ్లాలను కోవడం తమ తొలి విజయ మని బడేటి చంటి అంటున్నారు. అయితే ఎన్నికలకు ముందు ఆ పార్టీ ఇచ్చిన హామీల మేరకు 31 వేల మందికి ముందుగా ఇళ్లు నిర్మించి, టిడ్కో నివాసాలు అప్పగించాకే ఆళ్లనాని తన కార్యక్రమం చేస్తే బాగుంటుం దన్నారు. పథకాల పేరిట ఎంత ఇస్తున్నామో తెలియజేసే సమయంలోనే ఇతర రాష్ట్రాల్లో ఎపుడూలేని విధంగా పెంచిన గ్యాస్‌ చార్జీలు, ఇతర పన్నుల గురించి చెప్పి మరీ ఓటు అడగాలని బడేటి డిమాండ్‌ చేస్తున్నారు. కొత్తగా 1500 పెన్షన్లు ఇచ్చామని కొందరు నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని, తొలగించిన పెన్షన్ల గురించి ఎందుకు చెప్పడం లేదని ఆయన అడుగుతున్నారు.  


 మూడు నెలలుగా దూరంగా..

అధికార పార్టీ గ్రాఫ్‌ క్రమేణా ప్రజల్లో తగ్గుముఖం పట్టింది. 2019లో ఉన్న జోరు ఆ పార్టీ నాయకుల్లో ఎక్కడ చూసినా కనిపించడం లేదు. గడచిన సార్వత్రిక ఎన్నికల ముందు చూపిన చొరవ, దూకుడు ఇపుడు ఏ ఒక్కరిలోనూ  కనపడట్లేదు. ఏలూరు నియోజక వర్గ ఎమ్మెల్యే పనితీరే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. 2022 మే నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా ఆ పార్టీ పిలుపు మేరకు ‘గడప–గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొంటు న్నారు. పలుచోట్ల ఆ ప్రజా ప్రతినిధులకు చీత్కారాలు, అవమా నాలు, ప్రజల నుంచి ఊహించని ఎదురు ప్రశ్నలు ఎదురవుతు న్నాయి. కొందరు మొండిగా వెళుతుంటే కొందరు మాత్రం అరకొరగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మమ అనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏలూరు ప్రజాప్రతినిధి మూడు నెలలుగా ఆ కార్యక్రమానికి పూర్తిగా చేతులెత్తేశారు. కొన్నాళ్లు విదేశీ యాత్ర, మరికొన్నాళ్లు ప్రజా పథకాలపై ముద్రించిన పుస్తకాల కోసం ఎదురు చూపులు..ఇలా మూడు నెలలు కాలం గడిపేశారు. గడప–గడపకు కార్యక్రమంలో అడుగు బయట పెట్టని నాయకులకు ఇటీవల సీఎం వార్నింగ్‌ ఇచ్చారు. అందులో ఏలూరు ఎమ్మెల్యే కూడా ఉండటం గమనార్హం. దీంతో ఆగస్టు 8వ తేదీ నుంచి గడప–గడప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆల స్యంగా అయినా ప్రజల్లోకి వెళ్లబోతున్న ఆయనకు ఎలాంటి అనుభవాలు ఎదురు కాబోతున్నాయో వేచి చూడాలి. 


జనసేన సవాల్‌

కరపత్రాల పంపిణీ ద్వారా ఉత్తమ నాయకుడి ఎంపికే లక్ష్యంగా జనసేన పార్టీ ఏలూరులో వినూత్న ప్రయత్నం చేస్తోంది. ఆ పార్టీ తరఫున జూన్‌ నుంచి రోజుకో ప్రాంతంలో సాయంత్రం వేళ రెడ్డి అప్పలనాయుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల్లోని కృష్ణా కెనాల్‌, ఏలూరు జ్యూట్‌ మిల్‌, టిడ్కో నివాసాలు, చెత్త, ఇంటి పన్నులు, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు తదితర 20 సమస్యలను ఆ కరపత్రాల్లో ముద్రించారు. ప్రతీ ఒక్కరూ ఆ సమస్యల్ని గుర్తుచేసుకోవాలని, ఎవరి నాయ కత్వంలో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందో ప్రజలు ఒకసారి ఆలోచించాలని ఆయన తన కార్యక్రమం ద్వారా ప్రజలను కోరుతున్నారు.కార్పొరేషన్లో ఇటీవల విలీనమైన గ్రామాల్లో పర్యటిస్తూ స్థానిక సమస్యలపై దృష్టి పెడుతు న్నారు. ఆ గ్రామాల నుంచి కార్పొరేషన్‌ పన్నులు వసూలు చేస్తుందే తప్ప సౌకర్యాలు కల్పించడం లేదని అంటున్నారు. 25వ డివిజన్లో శనివారపు పేటలో ఎమ్మెల్యే ఆళ్ల నాని ఇంటికి సమీపంలోని ఓ 15 అడుగుల రోడ్డుకు మరమ్మ తులు కూడా చేయించుకోలేకపోయారని ఎద్దేవా చేస్తు న్నారు. కార్పొరేటర్లు అయితే కొత్త ఇంటి నిర్మాణాలకు రూ. 50 వేల చొప్పున వసూళ్లకు దిగడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల పనితీరును ఎండగడతామని తన ప్రచారం ద్వారా ప్రజల్లో నమ్మకం కలిగిస్తున్నారు. 


Updated Date - 2022-08-07T05:25:58+05:30 IST