మెక్సికోలో ఘోరం.. పోలీసుకు నిప్పంటించిన నిరసనకారులు!

ABN , First Publish Date - 2020-06-06T02:16:20+05:30 IST

మాస్కు వేసుకోనందుకు ఓ వ్యక్తిని పోలీసులు కొట్టిచంపేశారంటూ అమెరికాలోని మెక్సికోలో నిరసనలు చెలరేగుతున్నాయి.

మెక్సికోలో ఘోరం.. పోలీసుకు నిప్పంటించిన నిరసనకారులు!

మెక్సికో: మాస్కు వేసుకోనందుకు ఓ వ్యక్తిని పోలీసులు కొట్టిచంపేశారంటూ మెక్సికోలో నిరసనలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో ఆందోళనకారులను అదుపు చేయడానికి వచ్చిన పోలీసు అధికారులపై నిరసనకారులు దాడి చేశారు. మాస్కు వేసుకోలేదని ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సదరు వ్యక్తి మృతదేహం లభించింది. పోలీసులే ఆ వ్యక్తిని కొట్టి చంపారని కొందరు ఆరోపించారు. దీంతో మెక్సికోలోని గాదల్‌జారాలో నిరసనలు చెలరేగాయి.  ఈ క్రమంలో ఓ పోలీసు అధికారికి నిప్పంటించారు. ఇది చూసిన మిగతా అధికారులు వెంటనే స్పందించి.. మంటలను ఆర్పేసి, ఆ అధికారిని ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2020-06-06T02:16:20+05:30 IST