Abn logo
Oct 20 2021 @ 00:35AM

పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి

అమరవీరులపై రచించిన గేయాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి, ఎస్పీ

మంత్రి తానేటి వనిత  

పోలీస్‌ అమరవీరులపై గేయం ఆవిష్కరణ  

పాల్గొన్న ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ

తాడేపల్లిగూడెం రూరల్‌, అక్టోబరు 19: ప్రజా రక్షణలో పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని తన నివాసం వద్ద పాలకొల్లుకు చెందిన నాగరాజు  పోలీసు అమరవీరుల కోసం రచించిన గేయాన్ని ఆమె మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ మాట్లాడుతూ  తమ సేవల్ని గుర్తించి తమ కోసం ప్రత్యేకంగా గేయాన్ని రచించడం  అభినందనీయమన్నారు.  డీఎస్పీ బి. శ్రీనాథ్‌, సీఐలు వీరా రవికుమార్‌, ఆకుల రఘు,  గేయ రచయిత నాగరాజు, వైద్యుడు తానేటి శ్రీనివాస్‌, ఎస్‌ఐలు పాల్గొన్నారు. 

గణపవరం: విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు  మరువలేమని, వారిని స్మరించుకోవడం అందరి బాధ్యత అని గణపవరం సీఐ వి. వెంకటేశ్వర రావు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా మంగళవారం గణపవరం, నిడమర్రు పీఎంపీల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా  గణపవరం మండల పీఎంపీల అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ మూర్తి అధ్యక్షతన జరిగిన సభలో సీఐ మాట్లాడుతూ ప్రజల రక్షణకు అహర్నిశలు శ్రమించే పోలీసుల పాత్ర వెలకట్టలేనిదన్నారు.  తొలుత అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం పోలీసులతో పాటు ఇతరులకు 120 మందికి ఈసీజీ, వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అంద జేశారు.  గణపవరం  ఎస్‌ఐ ఎం.వీరబాబు, పీఎంపీల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జయసూర్య, ప్రధాన కార్యదర్శి బీటీ రాజు, జిల్లా అధ్యక్షుడు ఏఆర్‌కే పరమే శ్వర్లు, కార్యదర్శి ఎం.జయరాజు,  మూర్తి, అలీ, మండల కార్యదర్శి శ్రీనివాస రావు, ఉపాధ్యక్షుడు ప్రభాకరరావు  పాల్గొన్నారు.