ప్రజాస్వామ్యబద్ధ పోరాటంపై పోలీసు ఆంక్షలా..?

ABN , First Publish Date - 2022-08-12T05:47:35+05:30 IST

విద్యారంగాన్ని పరిరక్షించాలనీ, ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని కొన్ని నెలలుగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తుంటే పోలీసుల ఆంక్షలు పెట్టడం ఏంటని ఏపీటీఎఫ్‌ నేతలు మండి పడ్డారు.

ప్రజాస్వామ్యబద్ధ పోరాటంపై పోలీసు ఆంక్షలా..?
కలెక్టరేట్‌ వద్ద ఏపీటీఎఫ్‌ నాయకుల ఆందోళన

 ఏపీటీఎఫ్‌ నేతల ఆగ్రహం

అనంతపురం టౌన, ఆగస్టు11: విద్యారంగాన్ని పరిరక్షించాలనీ, ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని కొన్ని నెలలుగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తుంటే పోలీసుల ఆంక్షలు పెట్టడం ఏంటని ఏపీటీఎఫ్‌ నేతలు మండి పడ్డారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమంలో భాగంగా గురువారం ఏపీటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘం కలెక్టరేట్‌ ముట్టడి చేపట్టింది. అయితే పోలీసులు ముందురోజు నుంచే అనంతపురంతో పాటు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నేతలను ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. అయినా పలువురు ఏపీటీఎఫ్‌ నేతలు, శ్రేణులు, ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ ముట్టడికి తరలివచ్చారు. ర్యాలీగా చేరుకొని కలెక్టరేట్‌ ముట్టడికి ప్ర యత్నించారు. అప్పటికే అక్కడున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉపాధ్యాయులు అక్కడే నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమస్యలు పరిష్కరించాలని నినదించారు. ఏపీటీఎఫ్‌ రాష్ట్ర నాయకులు రఘురాంరెడ్డి, నరసింహులు, సీనియర్‌ నేత ప్రభాకర్‌ తదితరులు మాట్లాడుతూ నూతన విధానాలతో విద్యారంగం నిర్వీర్యమైపోతోందన్నారు. ఉపాధ్యాయ, విద్యారంగాల సమస్యల పరిష్కరించే వరకు ఏపీటీఎఫ్‌ ఉద్యమం కొనసాగిస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటేషులు, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజుద్దిన, నాయకులు రామునాయక్‌, మోహనరెడ్డి, బొమ్మయ్య, గాయత్రి, ఓబులేషు, అంజలి, సర్దార్‌వలి, ధనుంజయ, వన్నప్ప, శ్రీనివాసులు, అనంతయ్య, ఈశ్వరయ్య, మురళి పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-12T05:47:35+05:30 IST