మైదుకూరు, జనవరి 16 : గుంటూరు జిల్లా నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ అరవిందబాబుపైనే దాడి చేసి బూటుకాళ్లతో తన్నడం పోలీసుల ఆటవిక చర్య అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆయన మైదుకూరులో విలేకరులతో మాట్లాడుతూ అప్పటి నిజాం పాలనలా కన్న జగన్ పాలన పోలీసులతో దారుణాలకు పాల్పొడుతోందని విమర్శించారు. సమావేశంలో టీడీపీ నాయకులు ధనపాల జగన్, కటారు క్రిష్ణ, ఆర్ శ్రీనివాసులు, ముత్తూరు రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.