జాతీయ రహదారిపై పోలీసుల పహారా

ABN , First Publish Date - 2022-07-03T04:54:10+05:30 IST

ఎమ్మార్పీఎస్‌ తలపెట్టిన సడక్‌బంద్‌ కార్యక్రమం సందర్భంగా జాతీయ రహదారిపై శనివారం జిల్లా ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు.

జాతీయ రహదారిపై పోలీసుల పహారా
ముదిరెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

జడ్చర్ల, జూలై 2 : ఎమ్మార్పీఎస్‌ తలపెట్టిన సడక్‌బంద్‌ కార్యక్రమం సందర్భంగా జాతీయ రహదారిపై శనివారం జిల్లా ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. జాతీయ రహదారిపైకి రాకుండా ఎమ్మార్పీఎస్‌ నాయకు లను జడ్చర్ల పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. జాతీయ రహదారి జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి గోదాముల సమీపంలో జడ్చర్ల సీఐ రమేశ్‌బాబుతో కొద్దిసేపు మాట్లాడి వెళ్లారు. సడక్‌బంద్‌ కార్యక్ర మంలో భాగంగా ఎవరూ రోడ్డెక్కకుండా చర్యలు చేపట్టాలని ఈ సంద ర్భంగా ఆదేశించారు. 

మూసాపేట వద్ద అడిషనల్‌ ఎస్పీ రాములు  

మూసాపేట : ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌ఎఫ్‌ ఆధ్వ ర్యంలో శనివారం జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తామని హెచ్చ రించడంతో ముందస్తుగా స్థానిక పోలీసులతో పాటు జిల్లా నుంచి వచ్చిన పోలీసులతో మూసాపేట దగ్గర పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. బందో బస్తును అడిషనల్‌ ఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూ ర్‌ సీఐ రజితారెడ్డి మూసాపేటలో పరిశీలించారు. స్థానిక పోలీసులు గ్రా మాల్లో ఉన్న మాదిగ దండోర నాయకులను వారి ఇళ్లకు వెళ్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారిని మధ్యాహ్నం తరువాత సొంతపూచీకత్తుపై వదిలిపెట్టారు. డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, ఎస్‌ఐ నరేష్‌ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. వివిధ మండలాలకు చెందిన ఎమ్మార్పీఎస్‌ నాయకులు రహదారి దిగ్బంధం చేసేందుకు అనుమానాస్పదంగా తిరగ డాన్ని చూసిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని జడ్చర్లలోని డీటీసీకి తరలించారు.

ముందస్తుగా ఎమ్మార్పీఎస్‌ నాయకుల అరెస్టు

పాలమూరు : శనివారం హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్రమోదీ వస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా ఎమ్మార్పీఎస్‌-టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెపోగు శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శి నరేష్‌, కృష్ణ రావుల, నాగరాజులను అరెస్టు చేశారు. రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ ఉదయం 5.30గంటలకే వారిని అరెస్టుచేసి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారు. వారు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చి వంద రోజు ల్లోనే ఎస్సీ వర్గీకరణ చేసి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి నేటికీ చేయ లేదన్నారు. కేంద్రంలో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ అంశాన్ని తుంగలో తొక్కిపెట్టిందని పేర్కొన్నారు. సా యంత్రం సొంత పూచీకత్తుతో పోలీసులు వారిని వదిలపెట్టారు. 

ఎమ్మార్పీఎస్‌ సడక్‌ బంద్‌ను అడ్డుకున్న పోలీసులు

రాజాపూర్‌ : ఎమార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపుమేరకు మండల పరిధిలోని ముదిరెడ్డిపల్లి గ్రామంలోని స్థానిక జాతీయ రహదారిపై సడక్‌ బంధ్‌ కోసం పలు ప్రయత్నాలు చేస్తున్న ఎ మ్మార్పీఎస్‌ నాయకులను, కార్యకర్తలను అక్కడే ఉన్న పోలీసులు సడక్‌ బంధును విఫలం చేశారు.

ఎమ్మార్పీఎస్‌ నాయకులను వెంటనే విడుదల చేయాలి 

బాదేపల్లి : అరెస్ట్‌ చేసిన ఎమ్మార్పీఎస్‌ నాయకులను వెంటనే విడుదల చేయాలని కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు పరశురామ్‌ శనివారం ఓ ప్రకట నలో కోరారు. హైదరాబాద్‌కు భారతప్రధాని నరేంద్రమోదీ రాక సంద ర్భంగా ఎమ్మార్పీఎస్‌ నాయకులను అరెస్ట్‌ చేశారని పేర్కొన్నారు. వారిని బేషరతుగా విడుదల చేయాలని కోరారు. 

భూత్పూర్‌లో..

భూత్పూర్‌ : ఎస్సీ వర్గీకరణ వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకుడు మంద కృష్ణమాదిగ పిలుపు మేరకు శనివారం చేపట్టిన జాతీయరహదారి దిగ్బంధం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మండలంలో ఉన్న ఎమ్మార్పీఎస్‌ నాయ కులను ముందస్తుగా అరెస్టు చేశారు. సాయంత్రం సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. అంతకు ముందు విలేకరులతో ఎమ్మార్పీఎస్‌ జిల్లా వర్కింగ్‌ ప్రసిడెంట్‌ బోరింగ్‌ నర్సిములు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికైనా స్పందించి వెంటనే ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. అరెస్టు అయిన వారిలో గడ్డం రాములు, యాదయ్య, గడ్డం ఎల్లప్ప, మండి అంజి, కృష్ణయ్య, సత్తయ్య, ఊశన్న తదితరులు ఉన్నారు. 



Updated Date - 2022-07-03T04:54:10+05:30 IST