Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీఎం జగన్ నెల్లూరు పర్యటన నేపథ్యంలో పోలీసుల ఓవరాక్షన్

నెల్లూరు: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వరద బాధితులు సీఎంను నిలదీస్తారన్న అనుమానంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. జగన్ పర్యటనను అడ్డుకుంటే అరెస్టు చేస్తామంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వరదలపై ప్రశ్నిస్తారని అనుమానం ఉన్న వారందరికీ పోలీసుల వేధింపులు తప్పడంలేదు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రిని నిలదీస్తారనే అనుమానంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే సంజీవయ్య వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సీఎం మూడు గంటలపాటు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.

Advertisement
Advertisement