సంప్రదాయ దుస్తుల్లో పోలీసు అధికారులు

ABN , First Publish Date - 2021-01-16T05:20:38+05:30 IST

సంక్రాంతి పండుగ సంబరాలు గురువారం అలరించాయి.

సంప్రదాయ దుస్తుల్లో పోలీసు అధికారులు
సంప్రదాయ దుస్తుల్లో పోలీసు అధికారులు

కడప(క్రైం), జనవరి 15: సంక్రాంతి పండుగ సంబరాలు గురువారం అలరించాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తన సిబ్బందితో కలిసి సాంప్రదాయ దుస్తులు ధరించి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఎస్పీ బంగ్లాలో డీఎస్పీలు, సీఐలు తెల్లపంచ, తెల్లచొక్క  సాంప్రదాయ దుస్తులు ధరించి ఎస్పీని కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎస్పీ సిబ్బందికి స్వీట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని, ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. మనదేశం సాంప్రదాయాలకు పెట్టింది పేరని, కరోనా వైరస్‌ ఉన్న నేపఽథ్యంలో కొవిడ్‌ నియమ నిబంధనలు పాటిస్తూ పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవడం పట్ల శుభాభినందనలు తెలియజేశారు. 


Updated Date - 2021-01-16T05:20:38+05:30 IST