ఎస్‌ఐ ఉద్యోగ పరీక్షలో హైటెక్ కాపీయింగ్.. తలపై విగ్గు, చెవిలో బ్లూటూత్.. అతడిని ఎలా పట్టుకున్నారంటే..

ABN , First Publish Date - 2021-12-24T06:52:23+05:30 IST

పోలీస్ సబ్ ఇన్స్‌పెక్టర్(ఎస్ ఐ) ఉద్యోగం కోసం పరీక్ష రాయడానకి వచ్చిన వ్యక్తి అందరినీ సులువుగా మోసం చేసి కాపీ కొట్టడానికి టెక్నాలజీ ఉపయోగించాడు. అందరిలా స్లిప్పులు పెట్టకుండా.. హైటెక్ కాపీయింగ్ చేయడానికి తన వెంట కొన్ని పరికరాలు...

ఎస్‌ఐ ఉద్యోగ పరీక్షలో హైటెక్ కాపీయింగ్.. తలపై విగ్గు, చెవిలో బ్లూటూత్.. అతడిని ఎలా పట్టుకున్నారంటే..

పోలీస్ సబ్ ఇన్స్‌పెక్టర్(ఎస్ ఐ) ఉద్యోగం కోసం పరీక్ష రాయడానకి వచ్చిన వ్యక్తి అందరినీ సులువుగా మోసం చేసి కాపీ కొట్టడానికి టెక్నాలజీ ఉపయోగించాడు. అందరిలా స్లిప్పులు పెట్టకుండా.. హైటెక్ కాపీయింగ్ చేయడానికి తన వెంట కొన్ని పరికరాలు తెచ్చుకున్నాడు. 


తలపై ఒక విగ్గు పెట్టుకొని.. అందులో ఒక  మొబైల్ లాంటి పరికరాన్ని దాచుకున్నాడు. అలాగే చెవిలో సూక్ష్మంగా ఉండే బ్లూటూత్ కూడా తెచ్చుకున్నాడు. కానీ దురదృష్టం అతడిని వెంటాడింది. మొదట్లోనే అతని మోసం బయటపడింది. 


పరీక్ష రాయబోయే ముందు అక్కడ ఉన్న సిబ్బంది అతనికి  మెటల్ డిటెక్టర్‌తో చెక్ చేసి పట్టుకున్నారు. తలపైన ఏదో ఉండడంతో స్కానర్‌లు శబ్దం చేసాయి. దీంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది.. అతడిని క్షుణ్ణంగా పరిశీలించింది. అప్పుడు పరీక్ష రాసేందుకు వచ్చిన ఆ వ్యక్తి  తలపై పెట్టిన విగ్, చెవిలో ని బ్లూటూత్ అన్నీ బయటపడ్డాయి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది. ఒక ఐపిఎస్ అధికారి ఈ వీడియోని సోషల్ మీడియాలో పెట్టగా.. తెగ వైరల్ అవుతోంది.

Updated Date - 2021-12-24T06:52:23+05:30 IST