women Photos: మీ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా.. అయితే మీకూ ఈ సమస్య ఎదురవ్వొచ్చు.. జాగ్రత్త..

ABN , First Publish Date - 2022-09-25T03:36:57+05:30 IST

సోషల్ మీడియా వేదికగా వివిధ నేరాలు జరుగుతున్నయనే విషయం అందరికీ తెలుసు. కానీ ఈ నేరాలు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రస్తుతం గుర్తు తెలియని యువతులు..

women Photos: మీ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా.. అయితే మీకూ ఈ సమస్య ఎదురవ్వొచ్చు.. జాగ్రత్త..

సోషల్ మీడియా వేదికగా వివిధ నేరాలు జరుగుతున్నాయనే విషయం అందరికీ తెలుసు. కానీ ఈ నేరాలు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రస్తుతం గుర్తు తెలియని యువతులు, మహిళల ఫొటోలతో వికృత వ్యాపారం చేసే శాడిస్తుల ఉదంతం వెలుగులోకి వచ్చింది. తమ భర్త ఇంట్లో లేడు, ఇంటికి రావాలంటూ ఒకరి ఫొటో, పెళ్లి చేసుకోవడానికి అబ్బాయి కావాలంటూ మరొక మహిళ ఫొటోను ఉపయోగించి.. యువకులపై వల వేస్తున్నారు. మ్యాట్రిమోనీ సైట్లు (Matrimony sites) , యూట్యూబ్ వేదికగా తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. వీడియోలను మొత్తం చూడాలనిపించేలా.. అందమైన మహిళ ఫొటోలతో పాటూ పక్కనే అసభ్యకర పదజాలంతో కూడిన సందేశం ఉంటుంది. వీడియోలు ఎక్కువ మంది చూసేలా చేయడం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని గడిస్తున్నారు. బాధిత మహిళలు ఏబీఎన్‌ను ఆశ్రయించి, తమ గోడు వెళ్లబోసుకున్నారు..


నిజాంపేటకు చెందిన ఓ మహిళ సెప్టెంబర్ 19న యూట్యూబ్‌లో వీడియోలు (YouTube videos) చూస్తుండగా.. సడన్ తన ఫొటో చూసుకుని అవాక్కయింది. అందులో యువకులను తన ఇంటికి ఆహ్వానిస్తూ.. రాసిన అసభ్యకర పదజాలాన్ని చూసి షాక్ అయింది. తమకు జరిగిన అన్యాయంపై పలువురు బాధితులు ఏబీఎన్‌ను (ABN Andhra Jyothy) ఆశ్రయించారు. దీనిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫిర్యాదుపై సైబరాబాద్ కమిషన్ స్టీఫెన్ రవీంద్ర స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

ఏడాదిన్నరగా కొడుకు మృతదేహాన్ని ఇంట్లో ఉంచిన తల్లిదండ్రులు.. సడన్‌గా ఊపిరి రావడంతో ఇలా చేశామని చెబుతూ..


మ్యాట్రిమోనియల్ పేరుతో యూట్యూబ్‌ చానళ్లను ఏర్పాటు చేసి, అందులో గుర్తు తెలియని మహిళ ఫొటోలతో వీడియోలు చేస్తుంటారు. అసభ్యకర పదజాలంతో పాటూ అందమైన మహిళల ఫొటోలను చూసి వీడియోలు చూసేలా చేస్తుంటారు. వీడియోలో మహిళల గొంతుతో వాయిస్ ఉంటుంది. మీకు సంబంధం చూస్తాం అంటూ ఫొటోలోని మహిళలకు ఏదో ఒక పేరు పెడుతూ.. ఆస్తి బాగా ఉన్నట్లు చెబుతారు. వీడియో మొత్తం చూసినా.. అందులో ఎలాంటి నంబర్లు, ఆధారాలూ ఉండవు. వీడియోలన్నీ వైరల్ అవడం ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నట్లు పోలీసు విచారణలో బయటపడింది.  ఈ యూట్యూబ్ చానెళ్ల వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు.. ఏ ప్రాంతం నుంచి వీడియోలు చేస్తున్నారు.. తదితర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి యూట్యూబ్ చానల్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. బాధితులకు అండగా నిలిచినందుకు ఏబీఎన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

సీనియర్లు చేసిన పనికి.. రైల్వే స్టేషన్‌కు చేరుకున్న యువతులు.. పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా..



Updated Date - 2022-09-25T03:36:57+05:30 IST