ఒవైసీ ర్యాలీకి పోలీసుల అనుమతి నిరాకరణ

ABN , First Publish Date - 2021-11-23T16:14:20+05:30 IST

ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఈనెల 27న ముంబైలోని బీకేసీలో నిర్వహించాలనుకున్న..

ఒవైసీ ర్యాలీకి పోలీసుల అనుమతి నిరాకరణ

షెడ్యూల్ ప్రకారం ఈనెల 27న ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డవలప్‌మెంట్ అథారిటీ (ఎంఎంఆర్‌డీఏ) గ్రౌండ్స్‌లో మెగా ర్యాలీని ఎంఐఎం తలబెట్టింది. ఒవైసీతో పాటు, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మహారాష్ట్ర ఎంఐఎం అధ్యక్షుడు ఇంతియాజ్ జలీల్ హాజరుకావాల్సి ఉంది. వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు కేంద్రం ఇటీవల ప్రకటించిన క్రమంలోనే పౌరసత్వ సమవరణ చట్టాన్ని (సీఏఏ) కూడా రద్దు చేయాలని ఒవైసీ డిమాండ్ చేశారు. సీఏఏను రద్దు చేయకుంటే తమ పార్టీ నిరసన చేపడుతుందని హెచ్చరించారు.


ముంబై: ఈనెల 27న ముంబైలోని బీకేసీలో నిర్వహించాలనుకున్న ర్యాలీకి రాష్ట్ర పోలీసులు అనుమతి నిరాకరించారు. కోవిడ్, ఎంఎంఆర్‌డీఏ గ్రౌండ్స్‌లో జనసమీకరణపై నిషేధం అమలులో ఉండటం, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇటీల హింసాయుత ఘటనలు చెలరేగడం వంటి కారణాల రీత్యా ఒవైసీ ర్యాలీకి అనుమతి నిరాకరించినట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-11-23T16:14:20+05:30 IST