మావోయిస్టుల కోసం పోలీసుల గాలింపు

ABN , First Publish Date - 2020-09-27T10:46:04+05:30 IST

మావోయిస్టుల కోసం పోలీసుల గాలింపు

మావోయిస్టుల కోసం పోలీసుల గాలింపు

పాల్వంచ రూరల్‌, సెప్టెంబరు 26: మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా పాల్వంచ డీఎస్పీ కేఆర్‌కే. ప్రసాదరావు నేతృత్వంలో పోలీసు బలగాలు గత మూడు రోజులుగా మండల పరిధిలోని ఉల్వనూరు, బంజర, రేగులగూడెం, చంద్రాలగూడెం, రాజీవ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లోని గొత్తికోయ గ్రామాలు, సరిహద్దు అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు నిర్వహిస్తున్నారు. ప్రతి గుడిసెను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రతి పల్లెలో అనుమానితుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అనుమానితులు, కొత్త్తవారు ఆయా గ్రామాల్లో ఎవరైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాల్వంచ డీఎస్పీ ప్రసాదరావు గొత్తికోయలతో మాట్లాడారు. మావోయిస్టులకు సహకరించడం నేరమని సూచించారు. మావోయిస్టులకు సహకరించడం, వారికి ఆశ్రయం ఇవ్వడం, వారి సమాచారాన్ని దాచడం చేయవద్దన్నారు. యువకులు మావోయిస్టుల సంఘ విద్రోహక చర్యలకు ఆకర్శితులై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. కూంబింగ్‌లో పాల్వంచ రూరల్‌ ఎస్‌ఐ సుమన్‌, ములకలపల్లి ఎస్‌ఐ, పోలీసులు, స్పెషల్‌ పార్టీ బలగాలు పాల్గొంటున్నాయి. 


Updated Date - 2020-09-27T10:46:04+05:30 IST