పేకాట స్థావరంపై పోలీసుల దాడి

ABN , First Publish Date - 2022-07-02T05:30:00+05:30 IST

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

  • 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

కొడంగల్‌, జూలై 2 :  మండల పరిధిలోని చిన్ననందిగామలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈమేరకు శనివారం రాత్రి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై ఎ.రవి తెలిపారు. దాడుల్లో భాగంగా వారి వద్ద రూ.10,495 నగదు, 10 మొబైల్‌ ఫోన్‌లు, 7 ద్విచక్రవాహనాలు, 1 ఆటో స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2022-07-02T05:30:00+05:30 IST