uttarpradesh: హిజ్రా ఇంట్లో చోరీ: ఫేస్‌బుక్ సాయంతో దొంగను పట్టుకున్న పోలీసులు!

ABN , First Publish Date - 2021-07-13T14:32:57+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ పోలీసులు...

uttarpradesh: హిజ్రా ఇంట్లో చోరీ: ఫేస్‌బుక్ సాయంతో దొంగను పట్టుకున్న పోలీసులు!

మహారాజ్‌గంజ్: ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ పోలీసులు ఫేస్ బుక్ సాయంతో ఇద్దరు దొంగలను పట్టుకుని జైలుకు తరలించారు. పురందర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగపతి గ్రామానికి చెందిన హిజ్రా ఇంటిలో ఆరు లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయి. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఫేస్‌బుక్ సాయంతో నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి ఆరు లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నిందితులు గడచిన 9 రోజులుగా తమ లొకేషన్ మారుస్తూ వచ్చారు. పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌లలో తిరుగుతూ వచ్చారు.  అయితే వీరిపై దృష్ట సారించిన పోలీసులు ఎట్టకేలకు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదంతం గురించి ఎస్పీ ప్రదీప్ గుప్తా మాట్లాడుతూ హిజ్రా రజనీ గుప్తా ఇంటిలో చోరీ జరిగిందన్నారు. విలువైన బంగారు, వెండి నగలు మాయమయ్యాయన్నారు. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన ఇంటిలో మరో ఇద్దరు హిజ్రాలు గత కొన్ని నెలలుగా ఉన్నారని, వారిపైననే తనకు అనుమానం ఉన్నదని పేర్కొంది. దీంతో పోలీసులు నిందితుల కోసం వెదుకులాట ప్రారంభించారు. ఈ సమయంలో నిందితులు నగలకు సంబంధించిన ఒక ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. దీని ఆధారంగా పోలీసులు నిందితుల లొకేషన్ గుర్తించి, వారిని పట్టుకున్నారు. 

Updated Date - 2021-07-13T14:32:57+05:30 IST