పోలీసుల చిత్రహింసలు..

ABN , First Publish Date - 2022-05-22T06:43:10+05:30 IST

హిజ్రాలతో రికార్డింగ్‌ డ్యా న్స్‌ ఆడిస్తున్నారనే కారణంగా కొందరు యువకులను స్టేషన్‌కు తీసుకువచ్చి విచక్షణారహితంగా పోలీసులు చిత్రహింసలకు గురిచేసిన సంఘటన పి.గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 18న అర్ధరాత్రి జరిగింది.

పోలీసుల చిత్రహింసలు..
పప్పులవారిపాలెంలో పోలీసుల తీరును దుయ్యబడుతున్న రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు

 హిజ్రాలతో రికార్డింగ్‌ డ్యాన్సు ఆడించారని యువతను స్టేషన్‌కు తరలించి కొట్టిన పోలీసులు

 పి.గన్నవరం ఎస్‌ఐ సురేంద్రబాబు విచక్షణారహితంగా దాడి 

 తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన యువకులు 

 విషయాన్ని దాచిపెట్టేందుకు రాజీ యత్నాలు 

అమలాపురం, మే 21(ఆంధ్రజ్యోతి): హిజ్రాలతో రికార్డింగ్‌ డ్యా న్స్‌ ఆడిస్తున్నారనే కారణంగా కొందరు యువకులను స్టేషన్‌కు తీసుకువచ్చి విచక్షణారహితంగా పోలీసులు చిత్రహింసలకు గురిచేసిన సంఘటన పి.గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 18న అర్ధరాత్రి జరిగింది. పోలీసులు లాఠీలు, బెల్టులతో తీవ్రంగా కొట్టి గాయపరచడంతో కొందరు యువకులు కొత్తపేట ప్రభుత్వా సుపత్రిలో చేరారు. విషయం బయటకు రానివ్వకుండా కొందరు రాజకీయ నాయకుల సహకారంతో బాధిత కుటుంబాలతో పోలీసులు రాజీ ఒప్పందం చేసుకునే ప్రయత్నాలు చివరిక్షణంలో బెడిసికొట్టాయి. దీంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్‌ మీడియాలో బాధితుల దెబ్బలు తిన్న ఫొటోలు వైరల్‌ కావడంతో పాటు బాధితులు కాపు సామాజికవర్గానికి చెందినవారు కావడంతో కాపు జేఏసీకి చెందిన రాష్ట్ర నాయకులు రంగప్రవేశం చేశారు. పి.గన్నవరం మండలం కుందాలపల్లి వద్ద ఈ నెల 18వ తేదీన జువ్వాలమ్మవారి జాతర మహోత్సవాన్ని రాత్రి వేళల్లో భారీగా నిర్వహించారు. దీనిలో భాగంగా కొందరు ముగ్గురు హిజ్రాలతో రికార్డింగు డ్యాన్సు ఏర్పాటుచేశారు. అర్ధరాత్రి వేళ ఆ రికార్డింగు డ్యాన్సు హోరెత్తుతున్న వ్యవహారంపై 100కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేశారు. దీంతో పి.గన్నవరం పోలీసులు కొత్తపేట పోలీస్‌స్టేషన్‌ నుంచి హుటాహుటిన జాతర జరుగుతు న్న పప్పులవారిపాలానికి చేరుకున్నారు. దొరికన వారిని దొరికి నట్టు అక్కడే లాఠీలతో కొట్టారని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నా రు. ఆ తర్వాత కాపు సామాజికవర్గానికి చెందిన ఇరవై మంది యువకులను పి.గన్నవరం ఎస్‌ఐ సురేంద్రబాబు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు అర్ధరాత్రి వేళ తరలించారు. జాతర జరుగుతున్నట్టు కానీ, రికార్డింగు డ్యాన్సు ఏర్పాటు చేసినట్టు కానీ పోలీసులకు తెలియచేయకుండా నిర్వహించడం ఏమిటంటూ ఆగ్రహంతో ఊగిపోయిన ఎస్‌ఐ సురేంద్రతో సహా కానిస్టేబుళ్లు లాఠీలు, తోలు బెల్టులతో కొందరు యువకులను చితక్కొట్టి చిత్ర హింసలు పెట్టారు. రికార్డింగు డ్యాన్సు వ్యవహారంపై గ్రామానికి చెందిన పప్పుల ప్రసాద్‌తో సహా ఇరవై మందిపై పి.గన్నవరం పోలీసులు కేసు నమోదుచేశారు. 19వ తేదీ ఉదయం వారికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపించేశారు. పోలీసుల చిత్రహింసలకు గురైన కొందరు యువకులు లేవలేని పరిస్థితుల్లో 108కు ఫోన్‌ చేసి కొత్తపేట ప్రభుత్వాసుపత్రిలో చేరారు. అయితే బాధితులు తీవ్రమైన దెబ్బ లతో ఆస్పత్రిలో చేరినా ఈ విషయం బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. వారికి స్థానిక నాయకులు కొందరు సహకరించారు. అయితే తాజాగా ఈ వ్యవహారం సోషల్‌ మీడియాలో బాధితుల ఫోన్‌ నంబర్లు, గాయపరిచిన దెబ్బలతో కూడిన ఫొటోలతోసహా వైరల్‌ కావడం తో కాపు సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర నాయకత్వం పి.గన్న వరం ఎస్‌ఐ సురేంద్ర వ్యవహార శైలిపై తీవ్రంగా స్పందించింది. పలువురు రాష్ట్ర నాయకులు జాతర జరిగిన పప్పులవారిపాలెం వెళ్లి అక్కడి పరిస్థితులను విచారించడంతో పాటు కొత్తపేట ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాఽధితుడిని పరా మర్శించారు. రికార్డింగు డ్యాన్సు జరిగితే అందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదుచేసి అరెస్టులు చేయాలే తప్ప ఒక సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దూ షిస్తూ బాధితులను విచక్షణారహితంగా చిత్రహింసలకు గురిచే సిన ఎస్‌ఐ సురేంద్ర వ్యవహార శైలిపై నేతలు మండిపడ్డారు. ఈ వ్యవహారంపై కాపుసంఘ నేతలు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. కోనసీమ జిల్లా ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి దృష్టికి కొంతమంది పాత్రికేయులు ఈ విషయాన్ని తీసుకెళ్లగా చట్టానికి ఎవరూ అతీతులు కారని, చట్టం తనపని తాను చేసుకుపోతుందని సమాధానం చెప్పడం విశేషం.  పప్పులవా రిపాలెంలో రికార్డింగ్‌ డ్యాన్సు వేసిన ఘటనకు సంబంధించి పప్పుల ప్రసాద్‌తో సహా ఇరవైమందిపై కేసులు నమోదు చేసిన ట్టు పి.గన్నవరం పోలీసులు శనివారం సాయంత్రం విలేఖరులకు తెలిపారు.

యువకులపై దాడి అమానుషం

కొత్తపేట ప్రభుత్వాసుపత్రి వద్ద  ఉద్రిక్తత

 ఎస్‌ఐ సురేంద్రపై చర్యలకు కాపు జేఏసీ డిమాండ్‌ 

కొత్తపేట, మే 21:  గ్రామంలో జరిగే అమ్మవారిని జాతరను పురస్కరించుకుని పి.గన్నవరం మండలం పప్పులవారిపాలానికి చెందిన నలుగురు యువకులపై ఎస్‌ఐ సురేంద్ర నానా దుర్భాషలాడుతూ తీవ్రంగా గాయపరిచిన సంఘటనతో కొత్తపేట ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీనిపై పరామర్శకు వచ్చిన కాపు జేఏసీ నాయకులు ఎస్‌ఐపై రెండ్రోజుల్లో చర్యలు తీసుకోవాలని, లేకుంటే సోమవారం స్టేషన్‌వద్ద భైఠాయింపు చేపడతామని హెచ్చరించారు. కాపుజేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, కల్వకొలను తాతాజీ, సలాది రామకృష్ణ తదితరులు కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి వచ్చి బాధితుడిని పరామర్శి ంచారు. ఎస్‌ఐ సురేంద్ర యువకులను చిత్రహింసలు పెట్టడంపై వారు మండిపడ్డారు. గ్రామాల్లో జాతరలు జరిగేటప్పుడు సాం స్కృతిక కార్యక్రమాలు మామూలేనని, సర్దిచెప్పడం మాని పోలీసులు దాడులు చేయడంపై కాపుజేఏసీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై విచారణ చేసి ఎస్‌ఐపై చర్య తీసుకోకపోతే స్టేషన్‌ముందు భైఠాయించి  ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. గాయపడిన యువకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

విచారణాధికారిగా డీఎస్పీ మాధవరెడ్డి

అమలాపురం టౌన్‌, మే 21: పి.గన్నవరం మండలం పప్పులవారిపాలెంలో ఈనెల 18వ తేదీన  జువ్వాలమ్మతల్లి జాతర సందర్భంగా జరిగిన సంఘటనలో పి.గన్నవరం ఎస్‌ఐ సురేంద్రపై సోషల్‌మీడియాలో వచ్చిన ఆరోపణలపై డీఎస్పీ ఆఫీసులో రిపోర్టు చేయాల్సిందిగా కోనసీమ జిల్లా ఎస్పీ కె.ఎస్‌.ఎస్‌.వి.సుబ్బారెడ్డి శనివారం రాత్రి ఆదేశించారు. ఈ సంఘటనపై తక్షణచర్యగా అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డిని విచారణాధికారిగా నియమించినట్టు ఎస్పీ తెలిపారు.



Updated Date - 2022-05-22T06:43:10+05:30 IST