Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేరాల నియంత్రణకు పోలీసుల చర్యలు

పార్డి(బి)లో కార్డన్‌సెర్చ్‌

కుభీర్‌, నవంబరు 29 : నేరాల నియంత్రణకే జిల్లా పోలీసుఉన్నతాధికారుల ఆదేశాల అనుసారం కార్డన్‌సెర్చ్‌లను నిర్వహిస్తున్నట్లు భైంసా రూరల్‌ సీఐ చంద్ర శేఖర్‌ అన్నారు. సోమవారం మండలంలోని పార్డి(బి) గ్రామంలో తెల్లవారు జాము న 5 గంటల నుంచి ఉదయం 6ః30 గంటల వరకు కుభీర్‌ ఎస్సై గంగారాం ఆధ్వ ర్యంలో సుమారు వందమంది పోలీసులు గ్రామంలో సోదాలు నిర్వహించారు. ధృవీ కరణ పత్రాలు లేని వాహనాలను, నిషేదిత గుట్కా, గంజాయి, తంబాకు, మధ్యం తదితర వాటిపై ప్రత్యేకచర్యలు తీసుకున్నారు.  అనంతరం భైంసారూరల్‌ సీఐ చం ద్రశేఖర్‌ గ్రామస్తులతో మాట్లాడారు. ప్రజల రక్షణ శాంతిభద్రతల పరిరక్షణకై పోలీ సువ్యవస్థ నిరంతరం కృషి చేస్తుందన్నారు. గ్రామాల్లో నేరాల సంఖ్య పూర్తి స్థాయి లో తగ్గించి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసుల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వ్యాపార సముదాయాల వద్ద ప్రతీదుకాణదారు డు సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.  సరైనపత్రాలు లేని 74 ద్విచక్రవాహనాలు, మూడు జీపులను సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఎస్సైలు గంగారాం, శ్రీకాంత్‌లతో పాటు వందమంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 


Advertisement
Advertisement