మానవ అక్రమ రవాణా అరికడదాం

ABN , First Publish Date - 2021-07-31T05:23:24+05:30 IST

కలిసి కట్టుగా మానవ అక్రమ రవాణాను అరికడదామని అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ పిలుపునిచ్చారు.

మానవ అక్రమ రవాణా అరికడదాం
మానవ అక్రమ రవాణా నిరోధక పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌, అధికారులు, చైల్డ్‌ లైన్‌ ప్రతినిధులు

అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌


గుంటూరు, జూలై 30: కలిసి కట్టుగా మానవ అక్రమ రవాణాను అరికడదామని అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురష్కరించుకుని శుక్రవారం పోలీసు కార్యాలయంలో ఆయన పోస్టర్‌ను ఆవిష్కరించారు.  అనంతరం ఆరిఫ్‌ హఫీజ్‌ మాట్లాడుతూ బాలలు అక్రమ రవాణాకు గురవుతున్నట్టు గమనిస్తే డయల్‌ 100, లేదంటే చైల్డ్‌ లైన్‌ 1098, ఉమెన్స్‌ హెల్ప్‌లైన్‌ 181 నెంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. మానవ అక్రమ రవాణా అరికట్టడంలో స్వచ్ఛంద సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయన్నారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చట్టాలు అమలులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ఇన్‌చార్జి గంగాధరం, డీసీఆర్‌బీ డీఎస్పీ శ్రీనివాసరావు, మహిళా స్టేషన్‌ డీఎస్పీ రవికుమార్‌, స్పెషల్‌ బ్రాంచి సీఐలు బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, ఐటీ కోర్సు సీఐ కె.శ్రీనివాస్‌, చైల్డ్‌ లైన్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ కె.సమీర్‌కుమార్‌, సీడబ్ల్యూసీ కేర్‌ పర్సన్‌ డీఎస్‌ రాణి, పీవో విజయకుమారితోపాటు చైల్డ్‌ వెల్ఫేర్‌ జిల్లా, చైల్డ్‌ పర్సన్‌ ఆఫీసర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-31T05:23:24+05:30 IST