Abn logo
Oct 23 2021 @ 23:54PM

పోలవరానికి ఎస్‌పీఎఫ్‌ సేవలు అభినందనీయం

విజేతలతో తహసీల్దార్‌ సుమతి, ఎస్‌ఐ శ్రీను

పోలవరం అక్టోబరు 23 :పోలవరం ప్రాజెక్టు భద్రతా ఏర్పాట్లలో ఎస్‌పీ ఎఫ్‌ సిబ్బంది సేవలు అభినందనీయమని తహసీల్దార్‌ బి.సుమతి అన్నారు. స్థానిక ప్రాజెక్టు చెక్‌పోస్టు కార్యాలయం వద్ద స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్సు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి వాలీబాల్‌ పోటీలను ఎస్‌ఐ ఆర్‌.శ్రీను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా తహసీల్దార్‌ సుమతి కేక్‌ కట్‌ చేసి మాట్లాడారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఎస్‌పీఎఫ్‌ సీఐ ఎం.వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ కేఎన్‌ రావు, ఏఎస్‌ఐ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.