పోలవరం ప్రాజెక్టు నిధులపై తేల్చేసిన కేంద్రం

ABN , First Publish Date - 2021-10-07T16:52:38+05:30 IST

అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిధులపై కేంద్రం తేల్చేసింది.

పోలవరం ప్రాజెక్టు నిధులపై తేల్చేసిన కేంద్రం

అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిధులపై కేంద్రం తేల్చేసింది. దేశంలోని మిగతా ప్రాజెక్టులకు మాదిరిగా పోలవరం ప్రాజెక్టుకు కూడా అదనంగా నిధులు మంజూరు చేయాలని కేంద్ర జల శక్తి శాఖ కోరింది. మరో రూ. 4వేల కోట్లను అదనంగా మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు, కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసింది. ఆ లేఖను పరిశీలించి నిధులు ఇచ్చేది లేదని ఆర్థిక శాఖ  తేల్చిచెప్పింది. 2017లో కేంద్ర క్యాబినెట్ తీర్మానం మేరకు రూ. 20 వేల కోట్లకు మించి ఇచ్చేది లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేస్తూ.. ఈ మేరకు జలశక్తి శాఖకు లేక రాసింది. ఆ లేక సమాచారాన్ని కేంద్ర జల శక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి వివరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. నిన్న ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కలిశారు. పోలవరం నిధులకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ లేఖపై మంతనాలు జరిపారు. క్యాబినెట్ తీర్మానానికి కట్టుబడి ఉంటామని కేంద్ర ఆర్థిక మంత్రి తేల్చి చెప్పినట్టు సమాచారం.

Updated Date - 2021-10-07T16:52:38+05:30 IST