పేకాటజోరు...!

ABN , First Publish Date - 2020-07-02T09:59:26+05:30 IST

జిల్లాలో పేకాట జోరుందుకుంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా మూ డు ముక్కలు, ఆరో షోలుగా సాగుతోంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో

పేకాటజోరు...!

చేతివాటం ప్రదర్శిస్తున్న కొందరు పోలీసులు

పేట్రేగిపోతున్న పేకాటరాయుళ్లు

తరుచూ పట్టుబడుతున్నా మారనితీరు..

ఆదాయ వనరులుగా పేకాట స్థావరాలు


అనంతపురం క్రైం, జూలై1 :  జిల్లాలో పేకాట జోరుందుకుంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా మూ డు ముక్కలు, ఆరో షోలుగా సాగుతోంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో పేకాట మ రింత జోరందుకుంది. పోలీసులు నిఘా అరకొరగా ఉండటంతో పేకాటారాయుళ్లు రెచ్చిపోతున్నారు. జిల్లాలోని పట్టణ కేం ద్రాలలో అద్దెకు తీసుకుని మరీ పేకాట సాగిస్తున్నారనే ఆ రోపణలు లేకపోలేదు. కొందరు పోలీసులు కూడా చేతి వాటం ప్రదర్శిస్తున్నరనే విమర్శలు ఆ వర్గాల   నుంచి జోరుగా వినిపిస్తోంది. వారు మామూళ్ల మత్తులో ఉండ టంతోనే విచ్చలవిడిగా జిల్లాలో పేకాట సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


జిల్లాలో ఇటీవల పట్టుబడిన వివరాలు ఇలా...

జిల్లా కేంద్రంలోని కమలానగర్‌ డీఈఓ కార్యాల యం సమీపంలోని ఓ ఇంటిలో పేకాట ఆడుతున్న 11 మందిని డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐ ప్రతాపరెడ్డిలతో కలిసి అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ. 1.20 లక్షలు  స్వాధీ నం చేసుకున్నారు. అనంతపురం రూరల్‌, ఇటుకలపల్లి, నగరంలోని 1,2,3,4వ పట్టణ పోలీసులు కూడా లాక్‌డౌన్‌ సమయంలో పెద్దఎత్తున పేకాటరాయుళ్లను అరెస్ట్‌ చేసి రూ.లక్షలలో నగదు స్వాధీనం చేసుకున్నారు. శనివారం కూడా నగరంలోని బుడ్డప్పనగర్‌లో 11మంది పేకాటరా యుళ్లను అరెస్ట్‌ చేసి రూ.23,900 నగదును స్వాధీనం చేసుకున్నారు. 


ఈ నెల 15న రాయదుర్గం పట్టణంలో 12మంది పేకాటరాయుళ్లను అరెస్ట్‌ చేసి రూ.17 వేలు స్వాధీనం చేసుకున్నారు. 


హిందూపురం, పరిగి మండల పరిధిలోని వివిధ ప్రాంతాలలో పలుమార్లు పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు. వారి నుంచి భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. అయితే కొందరు అధికారులు రూ. లక్షల్లో పట్టుబడిన సొమ్మును రూ.వేలల్లో చూపించి జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.  కొన్ని కేసులు కూడా నమోదు చేయకుండా వదిలివేశారని సమాచారం. 


తాడిపత్రిలో  బుగ్గయ్య కాంపౌండ్‌లోని రేకులషె డ్డులో ఇటీవల పేకాటాడుతున్న 14మంది పేకాటరాయళ్లను అరెస్ట్‌ చేసి రూ. 2.40లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. 


ధర్మవరం సబ్‌ డివిజన్‌ పరిధిలోని  లాక్‌డౌన్‌ సమయంలో పేకాట ఎక్కువగా సాగుతోందని సమాచారం. ఇక్కడ కొందరు రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల సమక్షంలో పేకాటసాగిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు కూడా దాడులు చేసిన సంద్భంలో డబ్బులు పెద్దఎత్తున పట్టుబడినా తక్కువ మొత్తంలో చూపిస్తున్నట్లు వినికిడి. ప్రధానంగా తుమ్మల, తిప్పేపల్లి, మల్కాపురం,కునుకూరు, గొల్లపల్లి తదితర ప్రాంతాలలో పేకాట ఎక్కువగా  సాగు తోందని తెలిసింది. 


కొన్ని రోజుల కిందట పామిడి మండలంలోని కొం డాపురంలో నలుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్‌ చేసి రూ. 12వేలు స్వాధీనం చేసుకున్నారు. గుంతకల్లు పరిధిలోని దోనిముక్కల రోడ్డులో 8మంది పేకాటరాయుళ్లను అరెస్ట్‌ చేసి రూ.6 వేలు స్వాధీనం చేసుకున్నారు. కొనకొండ్లలో గత నెలలో 14మంది పేకాటరాయుళ్లను అరెస్ట్‌ చేసి రూ.15000 స్వాధీనం చేసుకున్నారు. లాక్‌డౌన్‌ సమ యం లో ఉరవకొండ ప్రాంతంలో 77 మంది పేకాటరా యు ళ్లను అరెస్టు చేసి రూ. 1.07 లక్షలు స్వాధీనం చేసు కున్నారు. 


కళ్యాణదుర్గం సబ్‌ డివిజన్‌లోని ఓ పోలీసుస్టేషన్‌ లో పనిచేస్తున్న ఓ ఎస్‌ఐ పెద్దఎత్తున పేకాటస్థావరాలపై దాడులు చేసి ఎక్కువ మొ త్తంలో పట్టుబడితే తక్కువ మొత్తం చూపించి సొమ్ము చేసుకుంటున్నారని పోలీసు వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇటీవల కూడా మానిరేవు పరిసర ప్రాంతాలలో వలంటీర్లు పేకాట ఆడుతూ ప ట్టుబడినా చేతివాటం ప్రదర్శించి ఓ ప్రజాప్రతినిధి ఫోన్‌ కాల్‌తో వారిపై కేసు లేకుం డా వదిలేశారని వినికిడి. ఉన్నతాధికారుల సహకారంతోనే ఇదంతా జరుగుతోందని ప్రచారం.


పోలీసుల కుమ్మక్కు

లాక్‌డౌన్‌ సమయంలో గతంలో పేరుమోసిన పేకాట రాయుళ్లు కొంద రు బృందాలుగా ఏర్పడి పేకాట స్థావ రాలను నడుపుతున్నట్లు సమాచారం. ఇందుకు కొందరు పోలీసు సహకారం ఉన్నట్లు వినికిడి.  నిర్వాహకులు, జూదగాళ్లతో కొందరు పోలీసులు కుమ్మక్కై బేరం కుదుర్చు కుని కేసులు లేకుండా, అవసరమైన వారిని వదిలివే యడం.. అరెస్ట్‌ చేసినట్లు స్టేషన్‌కు తీసుకువచ్చి కేసులు లేకుండా వదిలిపెట్టడం జరుగుతోందని సమాచారం. ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా సాగుతోందని స మాచారం. 


 ఆ ప్రాంతాలలో అధికం

జిల్లాలో ప్రధానంగా జిల్లా కేంద్రం మొదలుకుని ధర్మవ రం, తాడిపత్రి, గుంతకల్లు, హిందూపురం, కళ్యాణదుర్గం, పెనుకొండ, కదిరి, మడకశిర, రాయదుర్గం ప్రాంతాలలో జోరుగా సాగుతోంది. జిల్లా కేంద్రంతో పాటు నగర శివారులో గత కొంతకాలంగా నమోదవుతున్న కేసులను  పరిశీలిస్తే పేకాట జోరు తెలుస్తుంది. జిల్లా పోలీసు ఉ న్నతాధికారులు ఉన్న ప్రాంతాలలో జోరుగా పేకాట సాగుతుండటం మరింత కలవరం కలిగిస్తోంది.  

Updated Date - 2020-07-02T09:59:26+05:30 IST