పోయిరా బతుకమ్మ.. పోయిరావమ్మ

ABN , First Publish Date - 2021-10-15T04:14:48+05:30 IST

జిల్లాలోని అన్ని గ్రామాల్లో గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పెద్దగా పేర్చి ఆయా గ్రామాల్లో ఆలయాల ప్రాంగణాలు, ప్రధాన కూడళ్ల వద్ద పెట్టి మహిళలు బతుకమ్మ ఆడారు.

పోయిరా బతుకమ్మ.. పోయిరావమ్మ
చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

 జిల్లా వ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు


చిన్నకోడూరు/వర్గల్‌/కొండపాక/చేర్యాల/మద్దూరు/బెజ్జంకి/ నంగునూరు/రాయపోల్‌/గజ్వేల్‌టౌన్‌/నారాయణ రావుపేట/తొగుట, అక్టోబరు 14: జిల్లాలోని అన్ని గ్రామాల్లో గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పెద్దగా పేర్చి ఆయా గ్రామాల్లో ఆలయాల ప్రాంగణాలు, ప్రధాన కూడళ్ల వద్ద పెట్టి మహిళలు బతుకమ్మ ఆడారు. అనంతరం బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు. అనంతరం వాయినాలు తీసుకుని ప్రసాదాలను పంచిపెట్టారు. జలాశయాల వద్ద ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ పాల్గొన్నారు. వర్గల్‌ మండలంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీ జాలిగామ లత, వైస్‌ ఎంపీపీ బాల్‌రెడ్డి, జడ్పీటీసీ బాలుయాదవ్‌, సర్పంచ్‌లు గోపాల్‌రెడ్డి, వినోద, సంగీత, కనకయ్య, మంజులా, లత శివగౌడ్‌, సంధ్యా జానీ, శ్రీనివా్‌సరెడ్డి, పాపిరెడ్డి, నర్సింహ్మారెడ్డి, కటికే సంధ్యా జాని, ఎంపీటీసీలు వెంకటేశ్‌, జయమ్మ, సజనీత, శ్రీనివాస్‌, రాధ ప్రవీన్‌గౌడ్‌, సంది్‌పరెడ్డి, స్వాతి పాల్గొన్నారు. 


కొండపాక మండలంలోని కుకునూరుపల్లిలో సర్పంచ్‌ పోల్కంపల్లి జయంతినరేందర్‌ ఇంట్లో తొమ్మిది అడుగుల బతుకమ్మను పేర్చారు. చేర్యాల, కొమురవెల్లి మండలాల ప్రజలు సద్దుల బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. దూళిమిట్ట, మద్దూరు మండలాల్లో సంబురాలు అంబరాన్నంటాయి.


 నారాయణరావుపేట మండలంలో జడ్పీటీసీ లక్ష్మీరాఘవరెడ్డి, ఎంపీపీ బాలకృష్ణ, ఎంపీపీ ఉపాధ్యక్షుడు సంతో్‌షకుమార్‌, సర్పంచులు పరశురాములు, నారాయణ, మంజూలాశ్రీనివా్‌సరెడ్డి, మౌనికాభాస్కర్‌రెడ్డి, దేవయ్య, రుక్కమ్మ, ఆంజనేయులు, ఎంపీటీసీలు, చెరువు గట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గజ్వేల్‌ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యస్థాపక అధ్యక్షుడు రామకోటి రామారాజు 10వేల నాణేలతో 7 అడుగుల భారీ బతుకమ్మను చిత్రించారు.  

Updated Date - 2021-10-15T04:14:48+05:30 IST