పొగాకు వేలం బహిష్కరణ

ABN , First Publish Date - 2021-05-07T03:31:29+05:30 IST

జిల్లాలోని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లు గురువారం నిలిచిపోయాయి. రోజూలానే క్లస్టర్‌ వారీగా కొనుగోళ్లు జరుగుతున్న తరుణంలో

పొగాకు వేలం బహిష్కరణ
కొనుగోళ్లకు నోచుకోని పొగాకు బేళ్లు

 డీసీపల్లిలో నిలిచిన కొనుగోళ్లు

 ధరలు దిగజార్చారని రైతుల ఆవేదన

మర్రిపాడు, మే 6: జిల్లాలోని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లు గురువారం నిలిచిపోయాయి. రోజూలానే క్లస్టర్‌ వారీగా కొనుగోళ్లు జరుగుతున్న తరుణంలో దుత్తలూరు క్లస్టరు నుంచి రైతులు బేళ్లను తీసుకువచ్చారు. 490 బేళ్లను తీసుకురాగా 64 బేళ్ల వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. అయితే గరిష్ఠ ధరలు కిలోకు రూ.168లకు పడిపోవడంతో వారి ఆవేదనకు అంతులేకుండా పోయింది. దీంతోపాటుగా కనిష్ఠ ధర రూ. 100లకు చేరడంతో వేలాన్ని నిలిపేశారు. కనీసం గిట్టుబాటు ధరలు లేకుండా వ్యాపారులు మోసం చేస్తున్నారని వేలాన్ని బహిష్కరించారు. తమ మొర ఆలకించేవారే కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలు కల్పించేవరకు వేలం సాగనివ్వమని భీష్మించారు.

Updated Date - 2021-05-07T03:31:29+05:30 IST