Abn logo
Oct 25 2021 @ 22:08PM

పొదుపు నగదు స్వాహాపై ఫిర్యాదు

కుడుముల రాధమ్మ (ఫైల్‌)

వెంకటాచలం, అక్టోబరు 25 : మండలంలోని పూడిపర్తి లో పొదుపు నగదు స్వాహాపై సోమవారం వెంకటాచలం పోలీసులకు డీఆర్‌డీఏ ఏరియా కో-ఆర్డినేటర్‌ కనుపూరు శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పూడిపర్తికి చెందిన కుడుముల రాఽధమ్మ  కొంత కాలం నుంచి పొదుపు గ్రూపు ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తోంది.  ఆమె స్థానికంగా ఉన్న అభినయ పొదుపు గ్రూపు ద్వారా రూ.27,500, శ్రీగౌరీ పొదుపు గ్రూపు ద్వారా రూ.10,500, శ్రీసాయి పొదుపు గ్రూపు ద్వారా రూ.16,500, గణేష్‌ పొదుపు గ్రూపు ద్వారా రూ.1,59,000, పార్వతి పొదుపు గ్రూపు ద్వారా రూ.3,13,632లను, మొత్తం ఐదు పొదుపు గ్రూపుల నుంచి రూ.6,21,632ల నగదు స్వాహా చేసినట్లు తమ విచారణ తేలిందన్నారు. వీటితోపాటు మరికొంత స్ర్తీనిధి నగదు కూడా ఉందన్నారు. పొదుపు నగదును ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేయడమే కాకుండా సభ్యులను నమ్మించి మోసం చేసిందన్నారు. రాధమ్మపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి, పొదుపు మహిళల సొమ్మును తిరిగి వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.


పోలీసులకు వివరిస్తున్న పూడిపర్తి పొదుపు మహిళలు